పురపాలక సంఘ కార్యాలయం :: వనపర్తి
NOTES ON DEVELOPMENTAL ACTIVITIES

వనపర్తి జిల్లాలోని వనపర్తి పట్టణం మూడవ శ్రేణి పురపాలక సంఘముగా తేది.05.05.1984 రోజున ఏర్పడినది. ఈ పురపాలక సంఘం యందు 2011 సెన్సెస్ ప్రకారం పట్టణ జనాభా 70,416 గా వున్నది మొత్తం హౌజ్ హోల్డ్స్ 17,382 కలవు. ఈ పట్టణ వైశాల్యం 52.45 చదరపు మీటర్లుగా కలదు. మరియు పట్టణాన్ని 33 వార్డులుగా విభజించడమైనది. పట్టణ పరిసర గ్రామాలైన నాగవరం, రాజనగరం, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం ప్రాంతాలు తేది 14.03.2019 నాడు వనపర్తి మునిసిపాలిటిలో విలీనం కాబడినవి.
ఎ) అభివృద్ధి పనులు :
UIDF నిధులు:
వనపర్తి మునిసిపాలిటి యందు వివిధ వార్డ్లలో CC రోడ్లు మరియు CC డ్రైన్లు నిర్మిచుటకై 18.70 కోట్లతో టెండర్లు పిలువడం జరిగింది.
లేక్ రేజునివేషణ్ (అమృత్ 2.0):
వనపర్తి మునిసిపాలిటి యందు అమ్మ చెరువు యొక్క రేజునివేషణ్ కొరకు 3.14 కోట్లతో చెరువు వెంబడి భూగర్భ మురుగు నీటి కాలువ నిర్మించి మురుగునీరు చెరువులో కలువకుండా డైవర్షన్ చేయడం జరుగుచున్నది.
వాటర్ సప్లై (అమృత్ 2.0) :
వనపర్తి మునిసిపాలిటి యందు వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కొరకు 71.71 కోట్లతో 9 సుర్వేసు రిజర్వాయర్ ల నిర్మాణం కొరకు మరియు 95 కిలో మీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరుగుచునది.
అస్పిరెషణ్ టైలెట్:
వనపర్తి మున్సిపాలిటీ యందు అస్పిరేషణ్ టైలెట్ నిర్మాణం కొరకు 20.00 లక్షల అంచనాతో నిర్మించడం జరుగుతుంది.
స్టాంప్ డ్యూటీ నిధులు:
వనపర్తి మునిసిపాలిటి యందు వివిధ వార్డ్లలో CC రోడ్లు మరియు CC డ్రైన్లు నిర్మిచుటకై 3.0 కోట్ల అంచనాలు తయారు చేసి CDMA గారి అనుమతి కొరకు పంపిచడం జరిగింది.
15 ఫైనాన్సు:
వనపర్తి మునిసిపాలిటి యందు ట్రాక్టర్ మరియు డోజార్ కొనుగోలు చేయుటకు 15.0 లక్షలు టెండర్లు పిలువడం జరిగినది.
TUFIDC నిధులు:
వనపర్తి మున్సిపలిటు యందు 50.0 కోట్ల నిధులతో 33 వార్డ్ ల యందు వివిధ అభివృధి పనులు జరుగుచునది.
రోడ్ల విస్తరణ:
వనపర్తి పట్టణం యందు 2021 మార్చిలో రోడ్ల విస్తరణ చేపట్టడం జరిగింది. అందులో 5 ప్రధాన రహదారుల విస్తరణ అనగా
1) హైదరాబాద్ రోడ్డు : 40 ఫీట్ల నుండి 80 ఫీట్లు చేపట్టడం జరిగింది. (100% పూర్తి అయినది)
2) చిట్యాల రోడ్డు : 30 ఫీట్ల నుండి 70 ఫీట్లు చేపట్టడం జరిగింది. (100% పూర్తి అయినది)
3) పానుగల్ రోడ్డు : 25 ఫీట్ల నుండి 70 ఫీట్లు చేపట్టడం జరిగింది. (80% పూర్తి అయినది)
4) పెబ్బేర్ రోడ్డు : 60 ఫీట్ల నుండి 100 ఫీట్లు చేపట్టడం జరిగింది. (60% పూర్తి అయినది)
5) కొత్తకోట రోడ్డు : 70 ఫీట్ల నుండి 100 ఫీట్లు చేపట్టడం జరిగింది. (పని చేపట్టవలసి ఉన్నది
పట్టణములోని 5 ప్రధాన రహదారుల విస్తరణలో నివాస మరియు నివాసేతర భవనములు మొత్తం 119 తొలగించడం జరిగింది.
గ్రాంట్స్:
| Grants | Receipt | Expenditure | Balance (30.05.26) |
| i) 15వ ఆర్ధిక సంఘం నిధులు (2020-21 నుండి 2024-25) | 10,44,34,465/- | 9,89,38,752/- | 54,95,713/- |
| ii) బి. ఆర్.ఎస్./ఎల్.ఆర్.ఎస్. నిధులు (Up to 2024-25) | 94,060/- | 90,000/- | 4,060/- |
| iii) ఎస్.డి. ఎఫ్.నిధులు (2020-21 నుండి 2024-25) | 10,62,65,498/- | 10,62,65,498/- | 0 |
| Iv) ఎస్. ఎఫ్.సి. నిధులు | 1,10,12,030/- | 0 | 1,10,12,030/- |
బి) ఆసరా పెన్షన్లు:
అన్ని రకాల ఆసరా పెన్షన్లు మొత్తం 8445 (విలీన గ్రామాలు కలిపి) వివిధ వర్గాల వారికి అందివ్వడం జరుగుచున్నది.
| వృద్ధాప్య పెన్షన్లు | 3885 |
| వితంతువు పెన్షన్లు | 3022 |
| వికలాంగుల పెన్షన్లు | 1213 |
| కల్లుగీత కార్మికుల పెన్షన్లు | 28 |
| చేనేత కార్మికుల పెన్షన్లు | 32 |
| బీడీ కార్మికుల పెన్షన్లు | 97 |
| ఒంటరి మహిళ పెన్షన్లు | 168 |
| మొత్తం | 8445 |
సి) త్రాగునీటి సరఫరా:
| త్రాగునీటి సరఫరా వినియోగం | 13.5 యం.ఎల్.డి. |
| ఒక మనిషి వినియోగం | 135 లీటర్లు |
| గృహ వినియోగ నీటి కొళాయిలు | 15891 |
| ప్రజల నీటి కొళాయిలు | 125 |
| పవర్ బోర్స్ | 221 |
| నీటి సరఫరా పైప్ లైన్ | 172.98 కి.మీ. |
| నీటి జల భాండగారములు | 31 |
డి) రహదారులు:
| సి.సి. రహదారులు | 261.02 కి.మీ. |
| బి.టి.రహదారులు | 18.20 కి.మీ. |
| కచ్చ రహదారులు | 35 కి.మీ. |
| డబ్ల్యు.బి.యం. రహదారులు | 2.10 కి.మీ. |
| మొత్తం | 316.32 కి.మీ. |
ఇ) ఇందిర వనప్రభ:
ఇందిర వనప్రభ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మునిసిపాలిటి పరిధిలో 33 ట్రీ పార్కులకు గాను 21 ట్రీ పార్కులను ఏర్పాటు చేయడం జరిగినది. మిగతా 12 ట్రీ పార్కులు పూరోగతిలో కలవు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బృహుత్ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది.
వనపర్తి పట్టణం యందు మొక్కలు నాటే కార్యక్రమానికి పట్టణములోని మహిళ సంఘాల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరిగింది.
2025-2026 సంవత్సరమునకు గాను ఇందిర వనప్రభ కార్యక్రమానికి సంబంధించి 1,21,900 మొక్కల టార్గెట్ నకు గాను 1,13,720 మొక్కలు నాటి 93.29% లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది.
ఎఫ్) ఆస్తి పన్ను:
వనపర్తి పురపాలక ‘సంఘం యందు ఆస్తి పన్నుకు సంబంధించి పట్టణం యందు మొత్తం (48) బ్లాకులు, అదే విధంగా పురపాలక ‘సంఘం యందు విలీనమైన నాగవరం నందు (7) బ్లాకులు, రాజనగరం నందు (5) బ్లాకులు, శ్రీనివాసపురం నందు (8) బ్లాకులు నర్సింగాయపల్లి నందు (1) బ్లాకు కలవు.
| i) నివాస (Residential) భవనముల అసెస్మెంట్స్ | 15852 |
| ii) నివాసేతర (Commercial) భవనముల అసెస్మెంట్స్ | 2983 |
| మొత్తం అసెస్మెంట్స్ సంఖ్య | 18835 |
| 2026-2027 సం.ము యొక్క ఆస్తి పన్ను మొత్తం | 1281.53 లక్షలు |
| 2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళు (తేది.30.05.2026 వరకు) | 192.93 లక్షలు |
| 2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళ శాతం (తేది. 30.05.2026 వరకు) | 15.05% |
జి) మెప్మా:
వనపర్తి జిల్లాలో మొత్తం 5 మునిసిపాలిటిలు అనగా 1) వనపర్తి 2) ఆత్మకూర్ 3) అమరచింత 4) కొత్తకోట 5) పెబ్బేర్ మునిసిపాలిటిలు కలవు. 5 మున్సిపాలిటీలలో కలిపి 2418 మహిళా స్వయం సహాయక సంఘాలు కలవు అట్టి మహిళా సంఘాల యందు 24528 మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.
వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో మొత్తం 55 వికలాంగుల సంఘాలు కలవు, అట్టి సంఘాల యందు 280 మంది వికలాంగుల సంఘ సభ్యులు ఉన్నారు.
వనపర్తి జిల్లాలో 99 మహిళా స్లమ్ సమాఖ్యలు, 5 మునిసిపాలిటిలలో 5 పట్టణ సమాఖ్యలు కలవు.
నిరక్ష్య రాసులైన మహిళలకి ఉల్లాస్ ప్రోగ్రాం ద్వారా 600 మంది మహిళా సభ్యులని అక్షరాస్యులు గా తీర్చి దిద్దడం జరిగింది.
వడ్డీ లేని రుణాలు:
వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటిల యందు 2023-2024 మరియు 2024-2025 సం.మునకు సంబంధించి 956 సంఘాలకు రూ. 3.16 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం:
ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటిల యందు అర్హులైన పేద మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిచడం లక్ష్యంగా ప్రభుత్వం పంపిణి చేయడం జరిగింది.
ఆత్మ నిర్బార్ పథకం :
వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో వీధి విక్రయదారులకు ఆత్మ నిర్భార్ పథకం ద్వారా ఋణం మంజురునకు సర్వే చేపట్టి 7832 మందిని గుర్తించడం జరిగింది. అట్టి వీధి విక్రయదారులకు మొదటి విడతగా రూ.10,000/- చొప్పున 5745 మందికి, రెండవ విడతగా రూ. 20,000/- చొప్పున 3202 మందికి మరియు మూడవ విడతగా రూ.50,000/- చొప్పున 1219 మందికి బ్యాంకు లోన్ మంజూరు చేయడం జరిగింది.
బ్యాంకు లింకేజి రుణాలు:
వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 2026-2027 సం.మునకు గాను 631 మహిళ సంఘాలకు రూ. 6669.19 లక్షల రుణాల లక్ష్యానికి గాను 75 మహిళ సంఘాలకు రూ. 869.00 లక్షలు బ్యాంకు లింకేజి రుణాలను మంజూరు చేయించడం జరిగింది.
వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో స్త్రీ నిధి ద్వారా మొత్తం 340 మహిళా సంఘాలకురూ.2.50 కోట్లు మంజూరు చేయడానికి సిద్దంగా ఉంది.
స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్న సభ్యురాలు అనుకోకుండా చనిపోతే 10 లక్షల వారకి ప్రమాద భీమా మరియు తీసుకున్న ఋణము మాఫీ అవుతుంది.
ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న తరహ పరిశ్రమలను చేసుకొనుటకు మహిళా సంఘ సభ్యులకి శిక్షణా కార్యక్రమాల పైన అవగాహన కల్పించడం జరిగింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయుటలో భాగంగా వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మొత్తం 174 మంది మహిళ సభ్యులకు రూ.2.61 కోట్లు మంజూరు చేయించడం జరిగింది.
అమృత్ 2.0 పథకంలో భాగంగా 5 మున్సిపాలిటిలలో చెరువుల దగ్గర, పార్కుల దగ్గర మహిళా సంఘాల ద్వారా నీటి సంరక్షణకు మొక్కలు పెంచడం జరుగుచున్నది.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ద్వార 40 సమాఖ్యలలో 80 మహిళా ఆరోగ్య సమితి లను ఏర్పాటు చేయడమైనది. వీరి ద్వారా మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం జరుగుచున్నది.
కిషోర బాలికల (14 నుండి 18 సం. ల వయస్సు కలవారు ) ని గుర్తుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య పరిక్షలు చేయించి సమతుల్య ఆహరం తీసుకొని ఆరోగ్యంగా ఎదగాలని సలహాలు ఇవ్వడం అయినది . అలాగే కిషోర బాలికల కొరకై స్నేహ గ్రూప్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది
హెచ్) బస్తి దావఖానలు:
ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పట్టణం యందు కె.డి.ఆర్.నగర్ వాటర్ ట్యాంక్ (CRC Building) దగ్గర మరియు టీచర్స్ కాలనీ యందు బస్తి దవఖానలు ఏర్పాటు చేయబడినది.
ఐ) వాహనాల కొనుగోలు:
మూడు (3) చెత్త సేకరణ ట్రాక్టర్స్ మరియు మూడు (3) ఆటోలు కొనుగోలు చేయడం జరిగింది.
జె) బిల్డ్ నౌ (Build Now):
తెలంగాణ ప్రభుత్వం గృహ అనుమతుల (బిల్డింగ్ పర్మిషన్) కొరకు ఏప్రిల్ 2025 Build Now వెబ్ సైట్ ను ప్రారంభించింది. అట్టి Build Now ద్వారా వనపర్తి మునిసిపాలిటి యందు 30.05.2026 వరకు మొత్తం 344 ధరఖాస్తులను స్వీకరించండ జరిగింది. అట్టి వాటిలో 283 ధరఖాస్తులకు అనుమతులు ఇవ్వడమైనది, 23 ధరఖాస్తులను రిజెక్ట్ చేయడమైనది, 38 దరఖాస్తులు పెండింగ్ లో కలవు.
కె) ప్రజాపాలన (6 గ్యారంటీల పథకo):
తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనగా 1) మహాలక్ష్మి2) గృహజ్యోతి 3) యువ వికాసం 4) ఇందిరమ్మ ఇండ్లు 5) చేయూత 6) రైతు భరోసా వంటి పథకాల ప్రవేశపెట్టి అట్టి వాటి అమలుకై తేది.28.12.2023 నుండి 06.01.2024 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి మునిసిపాలిటి పరిధిలోని 33 వార్డుల యందు వార్డుల వారిగా సెంటర్ లు ఏర్పాటు చేసి మొత్తం 20,053 ధరఖాస్తులను స్వీకరించి వాటిని ఆన్ లైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టణం యందు అర్హులైన వారు జీరో (0) కరెంట్ బిల్లు మరియు గ్యాస్ సబ్సిడీ మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.
సంప్రదింపు వివరాలు:
కమీషనర్ పురపాలక సంఘం, వనపర్తి.
ఇమెయిల్ ఐడి: commissioner.wnpmplty@gmail.com
మొబైల్ నెం: 9849905923
9849981623 (శంకర్ మేనేజర్)