ముగించు

కొత్తకోట మునిసిపాలిటీ

పురపాలక సంఘ కార్యాలయం :: కొత్తకోట 

NOTES ON DEVELOPMENTAL ACTIVITIES

  • కొత్తకోట మున్సిపాలిటీ 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. కొత్తకోట గ్రామ పంచాయతీని 2018 సంవత్సరంలో మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది.
  • కొత్తకోట మున్సిపాలిటీ 16.38136° ఉత్తర అక్షాంశం (Latitude) మరియు 77.94094° తూర్పు రేఖాంశం (Longitude) వద్ద ఉంది. మున్సిపాలిటీ భౌగోళిక ఎత్తు సముద్ర మట్టానికి సుమారు +352.00 మీటర్ల నుండి +401.00 మీటర్ల వరకు ఉంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ జనాభా 19,042 కాగా, ప్రస్తుతం సుమారు 24,150 జనాభా ఉన్నట్లు అంచనా. మున్సిపాలిటీలో మొత్తం 15 ఎన్నికల వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీ మొత్తం విస్తీర్ణం 12.79 చదరపు కిలోమీటర్లు.
  1. A) అభివృద్ధి సాధించిన అంశాలు
  • వరద నీటి కాలువలు (Storm Water Drains – SWD):
  • కొత్తకోట మున్సిపాలిటీలో వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి TUFIDC నిధుల ద్వారా ₹50 కోట్ల అంచనా వ్యయంతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (SWD) పనులు చేపట్టడం జరిగింది.
  • నగరాభివృద్ధి నిధులు:
  • కొత్తకోట మున్సిపాలిటీలో నగరాభివృద్ధి నిధుల (Nagarabhivruddhi Funds) ద్వారా ₹00 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, సైడ్ డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, చెరువుల అభివృద్ధి, మీడియన్ ప్లాంటేషన్, వీధి దీపాల ఏర్పాటు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఉన్నాయి.
  • తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి:
  • తాగునీటి సరఫరా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి 1,200 KL మరియు 900 KL సామర్థ్యం కలిగిన రెండు ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (OHSRs) నిర్మించడం జరిగింది.
  • AMRUT 0 పథకం:
  • AMRUT 0 పథకం కింద 1,200 KL మరియు 900 KL సామర్థ్యం కలిగిన రెండు ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (OHSRs) నిర్మించడంతో పాటు, మున్సిపాలిటీ ప్రజలకు తగినంత మరియు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు పంపిణీ పైప్‌లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
  • మున్సిపల్ కార్యాలయ భవనం:
  • కొత్తకోట మున్సిపాలిటీకి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు TUFIDC నిధుల ద్వారా ₹00 కోట్ల అంచనా వ్యయంతో మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.
  • SBM 0 – Aspiration Toilet:

స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) 2.0 కింద ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించేందుకు ₹0.20 కోట్ల అంచనా వ్యయంతో Aspiration Toilet నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.

          గ్రాంట్స్  :

            GrantsReceipt                Expenditure            Balance (30.05.26)

 

i)15వ ఆర్ధిక సంఘం నిధులు     3,27,33,000/-        2,88,83,000/-              38,50,000/-

(2021-22 నుండి  2025-26)                      

            ii)బి. ఆర్.ఎస్./ఎల్.ఆర్.ఎస్. నిధులు   0/-                   0/-     0/-

 

            iii) ఎస్.డి. ఎఫ్.నిధులు                    16,22,000/-       14,65,000/-                   1,57,000/-

(2021-22 నుండి  2025–26)

  1. iv) ఎస్.ఎఫ్.సి. నిధులు 1,76,44,000/-      1,76,26,000/-        18,000/-

బి)     ఆసరా పెన్షన్లు :

అన్ని రకాల ఆసరా పెన్షన్లు మొత్తం 3221 వివిధ వర్గాల వారికి అందివ్వడం          జరుగుచున్నది.

  1. a) వృద్ధాప్య పెన్షన్లు                    :         1088
  2. b) వితంతువు పెన్షన్లు                 :         1325
  3. c) వికలాంగుల పెన్షన్లు                :         426
  4. d) కల్లుగీత కార్మికుల పెన్షన్లు        :         4
  5. e) చేనేత కార్మికుల పెన్షన్లు                    :         35
  6. f) బీడీ కార్మికుల పెన్షన్లు             :         262
  7. g) ఒంటరి మహిళ పెన్షన్లు            :         81

మొత్తం                          :           3221

  1. C) తాగునీటి సరఫరా (DRINKING WATER SUPPLY)

తాగునీటి సరఫరా పరిమాణం                        : 3.80 MLD

ప్రతి వ్యక్తికి తాగునీటి సరఫరా                        : 135 లీటర్లు/వ్యక్తి/రోజు

పవర్ బోర్లు                                            : 44

వాటర్ ట్యాంకులు / OHSRs                       : 12

వాటర్ ట్యాంకుల మొత్తం నిల్వ సామర్థ్యం                    : 1.350 MLD

మొత్తం HSCs (House Service Connections)       : 7,924

(మిషన్ భగీరథ ట్యాప్స్: 5,423

మున్సిపాలిటీ స్వంత కనెక్షన్లు: 2,501)

డి)      రహదారులు  :

సి.సి.  రహదారులు                                   :         25.00 కి.మీ.

బి.టి.రహదారులు                                     :         5.20 కి.మీ.

కచ్చ రహదారులు                                    :         26.50 కి.మీ.

డబ్ల్యు.బి.యం. రహదారులు                         :           12.50 కి.మీ.

మొత్తం              :             69.20కి.మీ.

ఇ)      ఇందిర వనప్రభ  :

ఇందిర వనప్రభ కార్యక్రమంలో భాగంగా కొత్తకోట మునిసిపాలిటి పరిధిలో 15 వార్డు లకు గాను9  ట్రీ పార్కులుమరియు 1నర్సరీ కలదు.

 

కొత్తకోట పట్టణం యందు మొక్కలు నాటే కార్యక్రమానికి పట్టణములోని  మహిళ సంఘాల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరిగింది.

 

2025-2026 సంవత్సరమునకు గాను ఇందిర వనప్రభ కార్యక్రమానికి సంబంధించి 50,000 మొక్కల      టార్గెట్ నకు గాను 38,000 మొక్కలు నాటి 76% లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది.

 

ఎఫ్)   ఆస్తి పన్ను :

కొత్తకోట పురపాలక ‘సంఘం యందు ఆస్తి పన్నుకు సంబంధించి పట్టణం యందు మొత్తం (24) బ్లాకులు    కలవు.

  1. i) నివాస (Residential) భవనముల అసెస్మెంట్స్         :         5935
  2. ii) నివాసేతర (Commercial) భవనముల అసెస్మెంట్స్   :         1401

మొత్తం అసెస్మెంట్స్ సంఖ్య                           :         7336

2026-2027 సం.ము యొక్క ఆస్తి పన్ను మొత్తం        :         159.77  లక్షలు

2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళు               :         65.15  లక్షలు

(తేది.31.08.2026వరకు)

2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళ శాతం        :         28.03%

(తేది. 31.08.2026వరకు)

జి)      మెప్మా :

కొత్తకోట పట్టణంలో393 మహిళా  స్వయం సహాయక  సంఘాలు కలవు అట్టి మహిళా సంఘాల యందు

4252  మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.

కొత్తకోట పట్టణంలో మొత్తం 7 వికలాంగుల సంఘాలుకలవు, అట్టి సంఘాల యందు 72 మంది

వికలాంగుల సంఘ  సభ్యులు ఉన్నారు.

కొత్తకోట పట్టణంలో 12 మహిళా స్లమ్ సమాఖ్యలు, కొత్తకోట పట్టణంలో 12 పట్టణ సమాఖ్యలు        కలవు.

నిరక్ష్య రాసులైన మహిళలకి ఉల్లాస్ ప్రోగ్రాం ద్వారా ____మంది మహిళా సభ్యులని అక్షరాస్యులు గా తీర్చి దిద్దడం జరిగింది.

వడ్డీ లేని రుణాలు :

కొత్తకోట పట్టణంలో యందు 2023-2024 మరియు 2024-2025 సం.మునకు సంబంధించి 311

సంఘాలకు రూ. 3.16 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

  ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం :

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా కొత్తకోట పట్టణం యందు అర్హులైన పేద          మహిళలకు

ఇందిరమ్మ చీరలు అందిచడం లక్ష్యంగా ప్రభుత్వం పంపిణి చేయడం జరిగింది.

ఆత్మ  నిర్బార్ పథకం :

కొత్తకోట పట్టణంలోని వీధి విక్రయదారులకు ఆత్మ నిర్భార్ పథకం ద్వారా ఋణం ముంజూరకు సర్వే చేపట్టి 1235 మందిని గుర్తించడం జరిగింది.అట్టి వీధి విక్రయదారులకు మొదటి   విడతగా రూ.10,000/-1074 మందికి, రెండవ విడతగా రూ. 20,000/- చొప్పున 985  మందికి మరియు మూడవ విడతగా రూ.50,000/- చొప్పున 235  మందికి బ్యాంకు లోన్ మంజూరు        చేయడం జరిగింది.

 

బ్యాంకు లింకేజి రుణాలు  :

కొత్తకోటపట్టణంలోమహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 2026-2027సం.మునకు గాను 94మహిళ సంఘాలకురూ 1006.84లక్షల రుణాల లక్ష్యానికి గాను 17మహిళ          సంఘాలకురూ.175.00లక్షలు బ్యాంకు లింకేజి రుణాలను మంజూరు చేయించడం జరిగింది.

స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్న సభ్యురాలు అనుకోకుండా చనిపోతే 10 లక్షల వారకి ప్రమాద భీమా మరియు తీసుకున్న ఋణము మాఫీ అవుతుంది

ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న తరహ పరిశ్రమలను చేసుకొనుటకు మహిళా సంఘ సభ్యులకి శిక్షణా కార్యక్రమాల పైన అవగాహన కల్పించడం జరిగింది.

కిషోర బాలికల (14నుండి 18 సం. ల వయస్సు కలవారు ) ని గుర్తుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య పరిక్షలు చేయించి సమతుల్య ఆహరం తీసుకొని ఆరోగ్యంగా ఎదగాలని సలహాలు ఇవ్వడం    అయినది . అలాగే కిషోర బాలికల కొరకై స్నేహ గ్రూప్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది

 

హెచ్)  బస్తి దావఖానలు   :

ప్రభుత్వ ఆదేశాల మేరకుకొత్తకోట పట్టణం యందు 13వ  వార్డ్  యందు  వికలాంగుల  భవన్  దగ్గర  బస్తి దావఖాన  ఏర్పాటు చేయబడినది.

 

ఐ)      వాహనాలు:

కొత్తకోట మునిసిపాలిటి యందు 2 చెత్త సేకరణ ట్రాక్టర్స్ మరియు 1 నీటి ట్యాంకర్మరియు 4 ఆటోలు,

1 JCBకలవు.

జె)      బిల్డ్ నౌ (Build Now) :

తెలంగాణ ప్రభుత్వం గృహ అనుమతుల (బిల్డింగ్ పర్మిషన్) కొరకు ఏప్రిల్ 2025 Build Now వెబ్ సైట్ను             ప్రారంభించింది. అట్టి Build Now ద్వారా కొత్తకోట మునిసిపాలిటి యందు 19.09.2026 వరకు మొత్తం       179 ధరఖాస్తులను స్వీకరించండ జరిగింది. అట్టి వాటిలో 166 ధరఖాస్తులకు అనుమతులు       ఇవ్వడమైనది,   5 ధరఖాస్తులను రిజెక్ట్ చేయడమైనది, 8 దరఖాస్తులు పెండింగ్ లో కలవు. 

కె)      ప్రజాపాలన (6 గ్యారంటీల పథకo)  :

తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనగా 1) మహాలక్ష్మి2) గృహజ్యోతి 3) యువ   వికాసం 4) ఇందిరమ్మ ఇండ్లు 5) చేయూత 6) రైతు భరోసా వంటి పథకాల ప్రవేశపెట్టి అట్టి వాటి అమలుకై       తేది.28.12.2023 నుండి 06.01.2024 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా కొత్తకోట మునిసిపాలిటి పరిధిలోని 15 వార్డుల     యందు వార్డుల వారిగా సెంటర్ లు ఏర్పాటు చేసి మొత్తం 6322 ధరఖాస్తులను స్వీకరించివాటిని ఆన్     లైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టణం యందు అర్హులైన వారు  జీరో (0) కరెంట్ బిల్లు మరియు గ్యాస్           సబ్సిడీ మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల          ద్వారా లబ్ది పొందుతున్నారు.

 

సంప్రదింపు వివరాలు:

కమీషనర్పురపాలక సంఘం, కొత్తకోట.

ఇమెయిల్ ఐడి:mckothakota@gmail.com

మొబైల్ నెం:9440418505.