ముగించు

అమర్చింత మునిసిపాలిటీ

          వనపర్తి జిల్లాలోని అమరచింత   పట్టణం మూడవ శ్రేణి పురపాలక సంఘముగా తేది.02.08.2018 రోజున ఏర్పడినది. ఈ పురపాలక సంఘం యందు 2011 సెన్సెస్ ప్రకారం పట్టణ జనాభా 11225 గా వున్నది మొత్తం హౌజ్ హోల్డ్స్ 2794 కలవు మరియు ఈ పట్టణ వైశాల్యం 18.96 చదరపు కిలో మీటర్లు మరియు 10 వార్డులుగా విభజించబడినది.

ఎ)అభివృద్ధి పనులు :

          అమరచింత   పట్టణం యందు SFC (పట్టణ ప్రగతి)  నిధుల ద్వారా రూ. 7.59 లక్షలు ఖర్చుచేయడం  2021-22  వ సంవత్సరంలో   పారిశుద్య నిర్వహణకు మరియు  తాగు నీటి సరఫరాకు జరిగింది. మరియు  2021-22  సంవత్సరంలో రూ.1.29 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మాణం, వైకుంఠధామం,  జంతు వధశాల నిర్మాణం గావించట కొరకు పనులు ప్రారంభం అయినవి మరియు   SFC (పట్టణ ప్రగతి)         నిధుల నుండి 1.45 (ఒక కోటి నలభై ఐదు లక్షల) 2021-2022 వ సంవత్సరంలో   సెంట్రల్ లైటింగ్, డివైడర్, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్  వార్డుల నందు  పూర్తి కావడం జరిగినది, వార్డుల నందు డ్రైనేజ్ లు పురోగతిలో ఉన్నాయి. 

బి) ఆసరా పెన్షన్లు :

        అన్ని రకాల పెన్షన్లు మొత్తం  2432 వివిధ వర్గాల వారికి అందివ్వడం జరుగుచున్నది. మరియు ఆగస్టు 2022 తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం కొత్త విడుదల చేసిన వాటిలో 190 వివిధ వర్గాల వారికి అందివ్వడం జరుగుచున్నది.

సి) త్రాగునీటి సరఫరా :

          త్రాగునీటి సరఫరా వినియోగం                       :         10  యం.ఎల్.డి.

          ఒక మనిషి  వినియోగం                                :         125 లీటర్లు

          గృహ వినియోగ నీటి కొళాయిలు                   :         1254    

          ప్రజల నీటి  కొళాయిలు                                :         55

          చేతి పంపులు                                             :         4

          పవర్ బోర్స్                                                :         17  

          నీటి సరఫరా పైప్ లైన్                                 :         25 కి.మీ.

          నీటి జల భాండములు                                :         4

డి) రహదారులు  :

          సి.సి.  రహదారులు                                     :         14 కి.మీ.

            బి.టి.రహదారులు                                     :         1.00 కి.మీ.

          కచ్చ రహదారులు                                      :         5 కి.మీ.

          డబ్ల్యు.బి.యం. రహదారులు                       :         2.00 కి.మీ.

                                                మొత్తం               :           22.00 కి.మీ.

) హరిత హారం :

హరిత హారం కార్యక్రమంలో భాగంగా అమరచింత  మునిసిపాలిటి పరిదిలోని రాజావలి దర్గా దగ్గర, 2వ వార్డ్ నందు మరియు ఎస్ సి కాలనీ ప్రాంతాలలో ట్రీ పార్కులను అదేవిధంగా 2వ వార్డ్ నందు నర్సరీ  ఏర్పాటు చేయడం జరిగినది.మరియు 7 వ వార్డ్ నందు మియా వాక్ ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ) టి ఎస్ బి పాస్ :

అమరచింత పట్టణంలో ఇంటి నిర్మాణం కొరకు టి ఎస్ బి పాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు 81 అందులో 80 వాటికి ఇంటి నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వడం జరిగినది మరియు  లేఅవుట్ కొరకు వచ్చిన దరఖాస్తులు 3 వాటిలో 2 లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం జరిగినది.

ఎఫ్) వీధి దీపాలు:

         మునిసిపాలిటీ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది మరియు అన్ని వీధుల్లో 644 LED లైట్లు అమర్చబడ్డాయి.

జి )సిబ్బంది:

       అమర్చింత మున్సిపాలిటీలో 01 రెగ్యులర్ స్టాఫ్ మరియు 02  అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మరియు 28 మంది    

       కార్మికులు  పని చేస్తున్నారు.

హెచ్ ) ఆదాయం:

        మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్లు కాకుండా ఆస్తి పన్ను ప్రధాన ఆదాయ వనరువివరాలు

        అసెస్‌మెంట్ సంఖ్య : 2796 సంఖ్యలు

        2022-23 డిమాండ్ : రూ.32.48 లక్షలు

        వసూలు చేసినవి  : రూ.8.42 లక్షలు

        బ్యాలెన్స్: రూ. 24.06 లక్షలు

ఐ ) నీటి సరఫరా:

 మిషన్ భగైరథ మరియు ఓన్ పవర్ బోర్లు నీటి సరఫరా పథకాలు (కొత్త & పాతవి) అమర్చింత పట్టణానికి తాగునీటి సరఫరాకు ప్రధాన వనరు.

నీటి సరఫరా అవసరం : – MLD

నీటి సరఫరా సరఫరా : – MLD

రోజుకు నీటి సరఫరా : 30 LPCD

కుళాయి కనెక్షన్ సంఖ్య: 1260 సంఖ్యలు

పబ్లిక్ ట్యాప్‌లు: 15 సంఖ్యలు

చేతి పంపులు : 05 సంఖ్యలు

పవర్ బోర్లు: 17 సంఖ్యలు

పైప్ లైన్ పొడవు: 10 కి.మీ

నీటి ట్యాంకుల సంఖ్య : 6 సంఖ్యలు

జే) పట్టణ ప్రగతి కార్యక్రమం:

          పట్టణంలో 03.06.2022 నుండి 18.06.2022 వరకు అమర్చింత మున్సిపాలిటీ నిర్వహించి, మున్సిపాలిటీలో సుమారు 1560 చ.మీ.ల ఓపెన్ ప్లాట్లు, రోడ్డు పక్కన కలుపు మొక్కలు, 90 వీధి దీపాలు బిగించి 14.5 కి.మీ డ్రైన్లను కార్యాలయం సిబ్బందితో క్లీన్ చేశారు మరియు 2 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగినది.

ప్లాస్టిక్ రహిత అమరచింత:

ప్లాస్టిక్ రహిత పట్టణంగా అమర్చింతను సాధించేందుకు ప్రభుత్వ సూచనల మేరకు పలుచోట్ల అవగాహన సమావేశాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్లాస్టిక్ రహితంగా ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

మెప్మా :

వనపర్తి    జిల్లాలో మొత్తం 5 మునిసిపాలిటిలు అనగా 1) అమరచింత   2) ఆత్మకూర్ 3) అమరచింత 4) కొత్తకోట 5) పెబ్బేర్ మునిసిపాలిటిలు కలవు.  వనపర్తి   జిల్లాలోని మొత్తం 5 మున్సిపాలిటీలలో  కలిపి 1902 మహిళా    స్వయం సహాయక  సంఘాలు కలవు అట్టి మహిళా సంఘాల యందు 19707 మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. మరియు మొత్తం 55 వికలాంగుల సంఘాలు, అట్టి సంఘాల యందు 280 మంది  వికలాంగుల సంఘ  సభ్యులు ఉన్నారు. మరియు జిల్లలో 72 మహిళా స్లం సమాఖ్యలు అలాగే వనపర్తి   జిల్లలో 5 మునిసిపాలిటిలలో 5  పట్టణ సమాఖ్యలు కలవు.

 జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ద్వార 40 సమాఖ్యలలో 80  మహిళా ఆరోగ్య సమితి లను ఏర్పాటు చేయడమైనది. వీరి ద్వారా మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.వనపర్తి    జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో వీధి విక్రయదారులకు ఆత్మ నిర్భార్ పథకం ద్వారా ఋణం మంజురునకు సర్వే చేపట్టి 5998 మందిని గుర్తించి 5213 మంది  వీధి విక్రయదారుల వివరములను పి.ఎం. స్వానిది ఆన్ లైన్ పోర్టల్ యందు నమోదు చేయడం జరిగింది. తదుపరి 3350  మంది  వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున బ్యాంకు ఋణమును మంజూరు చేయించడం జరిగింది. వనపర్తి     జిల్లాలోని  5 మునిసిపాలిటిలలో మహిళ సంఘాల ద్వారా హరిత హారం కార్యక్రమం కొరకు 2.50 లక్షల  మొక్కల పెంపకం చేపట్టడం జరుగుచున్నది.   

              2021-2022 సంవత్సరంలో వనపర్తి   జిల్లాలోని 5 మునిసిపాలిటిలలో 272 మహిళ సంఘాలకు రూ. 730.00 లక్షల బ్యాంకు లింకేజి రుణాల లక్ష్యానికి గాను 138 మహిళ సంఘాలకు రూ. 759.75 లక్షల బ్యాంకు లింకేజి రుణాలను మంజూరు చేయించడం జరిగింది. వనపర్తి  జిల్లా రుణాల మంజూరులో 104% లక్ష్యాన్ని చేరుకొని రాష్ట్రములో 3వ స్థానంలో కొనసాగడం జరుగుచున్నది.

స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమములో భాగంగా  వనపర్తి    జిల్లాలోని 5 మునిసిపాలిటిలలోని మహిళ సంఘాల వారు అభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుచున్నది. 

 కార్యాలయం స్టాఫ్ వివరాలు:

క్రమసంఖ్య

ఉద్యోగి పేరు

ఉద్యోగి యొక్క పోస్ట్

సంప్రదింపు నంబర్

1

కె కృష్ణయ్య

బిల్ కలెక్టర్ (మేనేజర్ I/C)

7989123848

2

ఎన్ రవి చంద్ర నాయక్

సిస్టమ్ మేనేజర్

9398902767

3

ఎస్ సాయి ఆదిత్య

పర్యావరణ ఇంజనీర్

6361183912

4

ఎం ప్రభాకర్

శానిటరీ ఇన్‌స్పెక్టర్ IOS

9490603791

5

రవీంధర్

బిల్ కలెక్టర్ ఓ/లు

8886751204

 కౌన్సిలర్ వివరాలు:

క్రమసంఖ్య

 పేరు

కౌన్సిలర్/సభ్యుడు

మొబైల్ నంబర్

1

మంగమ్మ (ఛైర్‌మెన్)

చైర్ పర్సన్

9440662284

2

జి ఎస్ గోపి (వైస్ చైర్మన్)

ఉపాధ్యక్షుడు

9440255755

3

ఎం లక్ష్మి

కౌన్సిలర్

9490237163

4

మంగ లావణ్య

కౌన్సిలర్

9966279307

5

విజయ రాములు

కౌన్సిలర్

9989919344

6

సింధు

కౌన్సిలర్

6300652551

7

రాజ్ కుమార్

కౌన్సిలర్

9951771223

8

ద్యావర్ల మాదవి

కౌన్సిలర్

9963628653

9

పారుపల్లి ఉషా రాణి

కౌన్సిలర్

8464061446

10

ఎం రాజశేఖర్ రెడ్డి

కౌన్సిలర్

7013635437