శాఖ గురించి:
ప్రభుత్వేతర రంగాలు, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ఈ శాఖ బాధ్యత వహిస్తుంది. యాజమాన్యాలు మరియు ఉద్యోగుల మధ్య శాంతిభద్రతలు, సౌరస్యం నెలకొల్పడానికి ఈ శాఖ వివిధ కార్మిక చట్టాలను అమలు చేస్తుంది.
ముఖ్యమైన విధులు:
- కార్మికుల సంక్షేమం మరియు సామాజిక భద్రతను పెంపొందించడం.
- సంక్షేమ పథకాల అమలు మరియు కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం.
- షాప్స్&ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ చట్టం, బిల్డింగ్&అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, బిల్డింగ్&అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టాల కింద రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సులు మంజూరు చేసే అథారిటీగా వ్యవహరించడం.
- బాలలు మరియు అడోలెసెంట్ (యుక్తవయస్సు) కార్మికుల నిరోధక మరియు నియంత్రణ చట్టం అమలు.
- వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు:
- 1996 B&OCW (RE&CS) చట్టం ప్రకారం 2009లో స్థాపించబడింది.
- భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులను లబ్ధిదారులుగా నమోదు చేసి, వారికి వివిధ సంక్షేమ పథకాలను అందిస్తుంది.
- భవన మరియు నిర్మాణ పనుల వ్యయంపై విధించే 1% సెస్ ద్వారా నిధులు సమకూరుతాయి.
- సీఈఓ (CEO) మరియు కార్యదర్శి ఈ బోర్డుకు నాయకత్వం వహిస్తారు.
తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు
|
క్రమ సంఖ్య |
పథకం పేరు |
పథకం వివరాలు |
ఆర్థిక సహాయం (రూపాయలలో) |
|
1 |
వివాహ కానుక |
నమోదు చేసుకున్న మహిళా కార్మికురాలికి లేదా నమోదు చేసుకున్న కార్మికుని ఇద్దరు కుమార్తెలకు వివాహ ఆర్థిక సహాయం |
రూ. 30,000/- |
|
2 |
ప్రసూతి లబ్ధి |
నమోదు చేసుకున్న మహిళా కార్మికురాలికి, లేదా నమోదు చేసుకున్న పురుష కార్మికుని భార్యకు, అలాగే ఇద్దరు కుమార్తెలకు ప్రసూతి లబ్ధి |
రూ. 30,000/- |
|
3 |
ఆసుపత్రి సహాయం |
ప్రమాదం లేదా తీవ్రమైన వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరిన నమోదు చేసుకున్న కార్మికుడికి రోజుకు రూ.300/- చొప్పున సహాయం |
నెలకు గరిష్టంగా రూ. 4,500/- (రోజుకు రూ. 300/- చొప్పున) |
భీమా (24-07-2025 నుండి అమలులోకి వచ్చెను)
|
క్రమ సంఖ్య |
పథకం పేరు |
పథకం వివరాలు |
ఆర్థిక సహాయం (రూపాయలలో) |
|
01 |
సాధారణ మరణ సహాయం |
నమోదు చేసుకున్న కార్మికుడు సాధారణంగా మరణిస్తే నామినీ / ఆధారపడినవారు / చట్టబద్ధమైన వారసులకు అందించే సహాయం |
రూ. 2,00,000/-
|
|
2 |
తీవ్ర ప్రమాద మరణ సహాయం |
పని ప్రదేశంలో లేదా మరెక్కడైనా జరిగిన ప్రమాదం వల్ల అక్కడికక్కడే లేదా గాయాల వల్ల మరణించిన నమోదు చేసుకున్న కార్మికుని నామినీ / ఆధారపడినవారు / చట్టబద్ధమైన వారసులకు అందించే సహాయం |
రూ. 10,00,000/-
|
రిజిస్ట్రేషన్లు&లైసెన్సులు:
- క్రింది చట్టాల కింద లైసెన్సుల జారీ:
- షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం
- మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ చట్టం
- కాంట్రాక్ట్ లేబర్ చట్టం
- అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం
- కనీస వేతనాల చట్టం అమలు: తనిఖీలు లేదా ఫిర్యాదులలో తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లు గుర్తిస్తే అధికారులు క్లెయిమ్‌లు దాఖలు చేస్తారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన:
- బాలకార్మిక (నిరోధక మరియు నియంత్రణ) చట్టం అమలు.
- రక్షించిన బాలల పునరావాసం కోసం సంబంధిత శాఖలతో సమన్వయం.
- పిల్లలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుకు1098 చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది.
ట్రేడ్ యూనియన్ల గుర్తింపు:
- ట్రేడ్ యూనియన్ల చట్టం, 1926 ప్రకారం గుర్తింపు.
- ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నోడల్ కార్యాలయం: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, మహబూబ్‌నగర్.
ఉద్యోగుల పరిహారం (ఎంప్లాయీస్ కాంపెన్సేషన్):
ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ చట్టం, 1923 ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నుండి కమిషనర్ ఆఫ్ లేబర్ స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తూ, పనిలో ప్రమాదాలు లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు పరిహారం మంజూరు చేస్తారు.
Contact Details:
|
క్రమ సంఖ్య |
పేరు |
హోదా |
మొబైల్ నంబర్ |
|
1 |
చుక్క రవి |
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ |
7780490729 |
|
2 |
ఎండి రఫీ |
జూనియర్ అసిస్టెంట్ |
9182709483 |
|
3 |
అడ్డకూల మద్దిలేటి |
ఆఫీస్ సబోర్డినేట్ |
9705052270 |
|
4 |
సి జె నిశాంత్ కుమార్ |
డేటా ఎంట్రీ ఆపరేటర్ |
9030575939 |
కార్యాలయ చిరునామా:
రూమ్ నెం-214, 2వ అంతస్తు, IDOC (కలెక్టరేట్), వనపర్తి
ఇమెయిల్: alo.wnp@gmail.com
శాఖ వెబ్‌సైట్లు: