పురపాలక సంఘ కార్యాలయం :: పెబ్బేర్
NOTES ON DEVELOPMENTAL ACTIVITIES
తెలంగాణ రాష్ట్ర Gazette Act No. 4 of 2018 ప్రకారంగా పెబ్బేరు గ్రామ పంచాయతి మరియు చెలిమిళ్ళ గ్రామపంచాయతిలను విలీనం చేస్తూ, పెబ్బేరు మున్సిపాలిటీ (గ్రేడ్ -3), 2వ, ఆగస్టు 2021 న కొత్తగా స్థాపించబడింది. ఇది అక్షాంశం 23˚24 ‘26.67 “మరియు రేఖాంశం 78˚5’ 33.33” పై ఉంది. దీని అక్షాంశం (+) 385.00 మీటర్ల నుండి (+) 410.00 మీటర్లు, ఈ పట్టణ వైశాల్యం 27.46 Sq Km కలదు. మరియు పట్టణాన్ని 12 వార్డులుగా విభజించడమైనది.
ఎ) అభివృద్ధి పనులు :
లేక్ రేజునివేషణ్ (అమృత్ 2.0) :
పెబ్బేరు మునిసిపాలిటి యందు కాసిం చెరువు యొక్క రేజునివేషణ్ కొరకు 3.14 కోట్లతో చెరువు వెంబడి భూగర్భ మురుగు నీటి కాలువ నిర్మించి మురుగునీరు చెరువులో కలువకుండా డైవర్షన్ చేయడం జరుగుచున్నది.
వాటర్ సప్లై (అమృత్ 2.0) :
పెబ్బేరు మునిసిపాలిటి యందు వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కొరకు 10.92 కోట్లతో 2 OHSR ట్యాంకుల నిర్మాణం కొరకు మరియు పైప్ లైన్ నిర్మాణం జరుగుచునది.
అస్పిరెషణ్ టైలెట్ :
పెబ్బేరు మున్సిపాలిటీ యందు అస్పిరేషణ్ టైలెట్ నిర్మాణం కొరకు 20.00 లక్షల అంచనాతో నిర్మించుటకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది.
15 ఫైనాన్సు :
పెబ్బేరు మునిసిపాలిటి యందు రెండు ఆటోలను 26.0 లక్షల నిధులతో కొనుగోలు చేయడం జరిగినది.
TUFIDC నిధులు:
పెబ్బేరు మునిసిపాలిటి యందు 25.00 కోట్ల నిధులతో 12 వార్డ్ ల యందు వివిధ అభివృధి పనులు జరుగుచునది.
రోడ్ల విస్తరణ :
పెబ్బేర్ పట్టణం యందు 2021 మార్చిలో రోడ్ల విస్తరణ చేపట్టడం జరిగింది. అందులో 5 ప్రధాన రహదారుల విస్తరణ అనగా
1) వనపర్తి రోడ్డు : 40 ఫీట్ల నుండి 80 ఫీట్లు చేపట్టడం జరిగింది. (95% పూర్తి అయినది)
2) ఓల్డ్ NH 44 రోడ్డు : 60 ఫీట్ల నుండి 100 ఫీట్లు చేపట్టడం జరిగింది. (100% పూర్తి అయినది)
పట్టణములోని 2 ప్రధాన రహదారుల విస్తరణలో నివాస మరియు నివాసేతర భవనములు మొత్తం తొలగించడం జరిగింది.
గ్రాంట్స్ :
Grants Receipt Expenditure Balance
(Rs in Lakhs)
- i) 15వ ఆర్ధిక సంఘం నిధులు 46 189.80 81.70 (2020-21 నుండి 2024-25)
- ii) బి. ఆర్.ఎస్./ఎల్.ఆర్.ఎస్. నిధులు 0 0 0
(Up to 2024-25)
iii) ఎస్.డి. ఎఫ్.నిధులు 50.00 50.00 0
(2020-21 నుండి 2024-25)
Iv) ఎస్. ఎఫ్.సి. నిధులు 308.3 291.78 16.95
బి) ఆసరా పెన్షన్లు :
అన్ని రకాల ఆసరా పెన్షన్లు మొత్తం 8445 (విలీన గ్రామాలు కలిపి) వివిధ వర్గాల వారికి అందివ్వడం జరుగుచున్నది.
- a) వృద్ధాప్య పెన్షన్లు : 425
- b) వితంతువు పెన్షన్లు : 775
- c) వికలాంగుల పెన్షన్లు : 260
- d) చేనేత కార్మికుల పెన్షన్లు : 21
- e) బీడీ కార్మికుల పెన్షన్లు : 0
- f) ఒంటరి మహిళ పెన్షన్లు : 80
మొత్తం : 1581
సి) త్రాగునీటి సరఫరా :
త్రాగునీటి సరఫరా వినియోగం : 3.24 యం.ఎల్.డి.
ఒక మనిషి వినియోగం : 135 లీటర్లు
గృహ వినియోగ నీటి కొళాయిలు : 3159
పవర్ బోర్స్ : 26
నీటి సరఫరా పైప్ లైన్ : 19 కి.మీ.
నీటి జల భాండగారములు : 15
డి) రహదారులు :
సి.సి. రహదారులు : 22.10 కి.మీ.
బి.టి.రహదారులు : 12 కి.మీ.
కచ్చ రహదారులు : 8 కి.మీ.
మొత్తం : 32.10 కి.మీ.
ఇ) హరిత హారం :
పెబ్బేర్ పట్టణం యందు మొక్కలు నాటే కార్యక్రమానికి పట్టణములోని మహిళ సంఘాల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరిగింది.
2026-2027 సంవత్సరమునకు గాను ఇందిర వనప్రభ కార్యక్రమానికి సంబంధించి 30,000 మొక్కల టార్గెట్ నకు గాను 16,750 మొక్కలు నాటి 55.83% లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది.
ఎఫ్) ఆస్తి పన్ను :
పెబ్బేర్ పురపాలక ‘సంఘం యందు ఆస్తి పన్నుకు సంబంధించి పట్టణం యందు మొత్తం (21) బ్లాకులు, పురపాలక ‘సంఘం యందు కలవు.
- i) నివాస (Residential) భవనముల అసెస్మెంట్స్ : 4,424
- ii) నివాసేతర (Commercial) భవనముల అసెస్మెంట్స్ : 943
మొత్తం అసెస్మెంట్స్ సంఖ్య : 5367
2026-2027 సం.ము యొక్క ఆస్తి పన్ను మొత్తం : 106.91 లక్షలు
2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళు : 50.49 లక్షలు
(తేది.16.09.2026 వరకు)
2026-2027 సం.ము ఆస్తి పన్ను వసూళ్ళ శాతం : 47.23%
(తేది. 16.09. 2026 వరకు)
జి) మెప్మా :
పెబ్బేర్ మునిసిపాలిటిలో కలిపి 297 మహిళా స్వయం సహాయక సంఘాలు కలవు అట్టి మహిళా సంఘాల యందు 2,947 మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.
పెబ్బేర్ మున్సిపాలిటీలో మొత్తం 7 వికలాంగుల సంఘాలు కలవు, అట్టి సంఘాల యందు 35 మంది వికలాంగుల సంఘ సభ్యులు ఉన్నారు.
పెబ్బేర్ మున్సిపాలిటీలో 10 మహిళా స్లమ్ సమాఖ్యలు కలవు.
నిరక్ష్య రాసులైన మహిళలకి ఉల్లాస్ ప్రోగ్రాం ద్వారా 320 మంది మహిళా సభ్యులని అక్షరాస్యులు గా తీర్చి దిద్దడం జరిగింది.
వడ్డీ లేని రుణాలు :
పెబ్బేర్ మున్సిపాలిటిల యందు 2023-2024 మరియు 2024-2025 సం.మునకు సంబంధించి 135 సంఘాలకు రూ. 15.65 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం :
ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా పెబ్బేర్ మున్సిపాలిటిల యందు అర్హులైన పేద మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిచడం లక్ష్యంగా ప్రభుత్వం పంపిణి చేయడం జరిగింది.
ఆత్మ నిర్బార్ పథకం :
పెబ్బేర్ మునిసిపాలిటి పరిధిలో వీధి విక్రయదారులకు ఆత్మ నిర్భార్ పథకం ద్వారా ఋణం మంజురునకు సర్వే చేపట్టి 1392 మందిని గుర్తించడం జరిగింది. అట్టి వీధి విక్రయదారులకు మొదటి విడతగా రూ.10,000/- చొప్పున 1300 మందికి, రెండవ విడతగా రూ. 20,000/- చొప్పున 371 మందికి మరియు మూడవ విడతగా రూ.50,000/- చొప్పున 178 మందికి బ్యాంకు లోన్ మంజూరు చేయడం జరిగింది.
బ్యాంకు లింకేజి రుణాలు :
పెబ్బేర్ మునిసిపాలిటి పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 2026-2027 సం.మునకు గాను 23 మహిళ సంఘాలకు రూ. 275.50 లక్షల లక్షలు బ్యాంకు లింకేజి రుణాలను మంజూరు చేయించడం జరిగింది.
పెబ్బేర్ మునిసిపాలిటి పరిధిలో స్త్రీ నిధి ద్వారా మొత్తం 340 మహిళా సంఘాలకు రూ.2.50కోట్లు మంజూరు చేయడానికి సిద్దంగా ఉంది.
స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్న సభ్యురాలు అనుకోకుండా చనిపోతే 10 లక్షల వారకి ప్రమాద భీమా మరియు తీసుకున్న ఋణము మాఫీ అవుతుంది
ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న తరహ పరిశ్రమలను చేసుకొనుటకు మహిళా సంఘ సభ్యులకి శిక్షణా కార్యక్రమాల పైన అవగాహన కల్పించడం జరిగింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయుటలో భాగంగా వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మొత్తం 174 మంది మహిళ సభ్యులకు రూ.2.61 కోట్లు మంజూరు చేయించడం జరిగింది.
అమృత్ 2.0 పథకంలో భాగంగా 5 మున్సిపాలిటిలలో చెరువుల దగ్గర, పార్కుల దగ్గర మహిళా సంఘాల ద్వారా నీటి సంరక్షణకు మొక్కలు పెంచడం జరుగుచున్నది.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ద్వార 40 సమాఖ్యలలో 80 మహిళా ఆరోగ్య సమితి లను ఏర్పాటు చేయడమైనది. వీరి ద్వారా మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం జరుగుచున్నది.
కిషోర బాలికల (14 నుండి 18 సం. ల వయస్సు కలవారు ) ని గుర్తుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య పరిక్షలు చేయించి సమతుల్య ఆహరం తీసుకొని ఆరోగ్యంగా ఎదగాలని సలహాలు ఇవ్వడం అయినది . అలాగే కిషోర బాలికల కొరకై స్నేహ గ్రూప్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది
హెచ్) బస్తి దావఖానలు :
ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పట్టణం యందు కె.డి.ఆర్.నగర్ వాటర్ ట్యాంక్ (CRC Building) దగ్గర మరియు టీచర్స్ కాలనీ యందు బస్తి దవఖానలు ఏర్పాటు చేయబడినది.
ఐ) వాహనాల కొనుగోలు :
రెండు (2) ఆటోలు కొనుగోలు చేయడం జరిగింది.
జె) బిల్డ్ నౌ (Build Now) :
తెలంగాణ ప్రభుత్వం గృహ అనుమతుల (బిల్డింగ్ పర్మిషన్) కొరకు ఏప్రిల్ 2025 Build Now వెబ్ సైట్ను ప్రారంభించింది. అట్టి Build Now ద్వారా వనపర్తి మునిసిపాలిటి యందు 16.09.2026 వరకు మొత్తం 124 ధరఖాస్తులను స్వీకరించండ జరిగింది. అట్టి వాటిలో 97 ధరఖాస్తులకు అనుమతులు ఇవ్వడమైనది, 21 ధరఖాస్తులను రిజెక్ట్ చేయడమైనది, 6 దరఖాస్తులు పెండింగ్ లో కలవు.
కె) ప్రజాపాలన (6 గ్యారంటీల పథకo) :
తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనగా 1) మహాలక్ష్మి2) గృహజ్యోతి 3) యువ వికాసం 4) ఇందిరమ్మ ఇండ్లు 5) చేయూత 6) రైతు భరోసా వంటి పథకాల ప్రవేశపెట్టి అట్టి వాటి అమలుకై తేది.28.12.2023 నుండి 06.01.2024 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి మునిసిపాలిటి పరిధిలోని 33 వార్డుల యందు వార్డుల వారిగా సెంటర్ లు ఏర్పాటు చేసి మొత్తం 20,053 ధరఖాస్తులను స్వీకరించి వాటిని ఆన్ లైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పట్టణం యందు అర్హులైన వారు జీరో (0) కరెంట్ బిల్లు మరియు గ్యాస్ సబ్సిడీ మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.
సంప్రదింపు వివరాలు:
కమీషనర్ పురపాలక సంఘం, వనపర్తి.
ఇమెయిల్ ఐడి: mcpebbair@gmail.com
మొబైల్ నెం: 9440418505
9959520207 (K N Gnesh Babu – Manager)