మత్స్యశాఖ
కార్యాలయ చిరునామ: జిల్లా మత్స్యశాఖ కార్యాలయం, గది నం. 204 & 206, IDOC భవనం, వనపర్తి.
ఆఫీసు సిబ్బంది వివరాలు:
|
క్రమ. సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
శాశ్వత / కాంట్రాక్ట్ |
మొబైల్ నంబర్ |
|
1 |
బి. లక్ష్మప్ప |
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ / జిల్లా మత్స్యశాఖ అధికారి |
శాశ్వత |
9441076533 |
|
2 |
బి. సునీత |
జూనియర్ అసిస్టెంట్ |
శాశ్వత |
8897218462 |
|
3 |
డి.భరత్ |
ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ |
కాంట్రాక్ట్ |
8897347063 |
|
4 |
ch. వీరేష్ కుమార్ |
ఫీల్డ్‌మన్ |
శాశ్వత |
8790170414 |
|
5 |
టి. సుధా కిరణ్ |
ఫిషరీస్ అసిస్టెంట్ |
కాంట్రాక్ట్ |
9885587301 |
|
6 |
ఎ. మైబూస్ |
డీఈఓ |
అవుట్‌సోర్సింగ్ |
9885412196 |
|
7 |
పి. శ్రవణ్ కుమార్ |
డీఈఓ |
అవుట్‌సోర్సింగ్ |
9849758156 |
|
8 |
వి. రవి |
మత్స్యకారుడు |
కాంట్రాక్ట్ |
9505829181 |
|
9 |
బి. రాజు |
మత్స్యకారుడు |
కాంట్రాక్ట్ |
9177325106 |
Department e mail id: dfownaparthy@gmail.com
తెలంగాణ రాష్ట్ర చేప – కొర్రమీను (Chenna striata)
మత్స్యరంగం మత్స్యకారుల జీవనోపాధిలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో పాటు ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తుంది. వనపర్తి జిల్లాలో మత్స్య కార్యకలాపాలు మరియు చేపల ఉత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మత్స్య అభివృద్ధికి అనుకూలమైన (960) చెరువులు మరియు (5) రిజర్వాయర్లు ఉన్నాయి. వనపర్తి జిల్లా చేపల పెంపకానికి అధిక సామర్థ్యం కలిగిన ప్రాంతం. జిల్లాలో విస్తారమైన నీటి వనరులతో పాటు కృష్ణా నది మరియు దాని బ్యాక్‌వాటర్ ప్రాంతం కూడా ఉంది. దీనివల్ల సహజ మత్స్య సంపద పెరిగి, స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తోంది. చాలా చెరువులు కాలువల ద్వారా నీరు పొందుతూ, సంవత్సరం పొడవునా నీరు ఉండే స్వభావం కలిగి ఉన్నాయి.
- రిజర్వాయర్ల వివరాలు
|
క్రమ సంఖ్య |
రిజర్వాయర్ పేరు |
గ్రామం |
మండలం |
మొత్తం నీటి విస్తీర్ణం (హెక్టార్లు) |
|
1 |
సర్లసాగర్ |
శంకరంపేట |
మదనాపూర్ |
1077 |
|
2 |
ఉకచెట్టువాగు |
రామన్‌పాడ్ |
మదనాపూర్ |
220 |
|
3 |
ఏనుకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ |
అమడబాకుల |
కొత్తకోట |
50 |
|
4 |
రంగసముద్రం |
శ్రీరంగాపూర్ |
శ్రీరంగాపూర్ |
746 |
|
5 |
గోపాల్దిన్నె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ |
గోపాల్దిన్నె |
వీపనగండ్ల |
240 |
- మత్స్యకారుల సహకార సంఘాలు
జిల్లాలో మత్స్యకారుల సంక్షేమం కోసం, సాధ్యాసాధ్యాలు ఉన్న గ్రామాల్లో మత్స్యసహకార సంఘాలను ఏర్పాటు చేస్తోంది.
|
క్రమ సంఖ్య |
వివరణ |
FCS/FWCS/FLHMS సంఖ్య |
సభ్యుల సంఖ్య |
|
1 |
మత్స్యకారుల సహకార సంఘాలు |
126 |
12658 |
|
2 |
మహిళా మత్స్యకారుల సహకార సంఘాలు |
18 |
876 |
|
3 |
మత్స్యకారుల లైసెన్స్ హోల్డర్స్ మార్కెటింగ్ సంఘాలు |
2 |
650 |
|
|
మొత్తం |
146 |
14184 |
III. సంక్షేమ పథకాలు
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY): ఈ పథకం కింద, వ్యవసాయానికి అనుకూలం కాని స్వంత పట్టా భూముల్లో కొత్త చేపల చెరువులు / చేప పిల్లల పెంపకం చెరువులు నిర్మించడానికి ఆసక్తి ఉన్న అర్హత కలిగిన రైతులకు మత్స్యశాఖ అనుమతులు మరియు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఆక్వాకల్చర్ అనుమతులు: ఆక్వాకల్చర్ ప్రయోజనం కోసం తమ స్వంత పట్టా భూముల్లో చేపల పెంపక చెరువులు నిర్మించుకునేందుకు అర్హతలను అనుసరించి ప్రైవేట్ రైతులకు కూడా అనుమతులు అందిస్తోంది. ఇప్పటివరకు అనుమతులు ఇచ్చిన వివరాలు:
|
మండలం |
రైతుల సంఖ్య |
మొత్తం విస్తీర్ణం (హెక్టార్లు) |
|
అమరచింత |
1 |
0.80 |
|
ఆత్మకూర్ |
23 |
45.17 |
|
చిన్నంబావి |
3 |
6.66 |
|
ఘన్‌పూర్ |
1 |
0.40 |
|
కొత్తకోట |
1 |
0.84 |
|
మదనాపూర్ |
4 |
4.40 |
|
పెబ్బైర్ |
41 |
70 |
|
రేవల్లి |
2 |
2.80 |
|
వనపర్తి |
1 |
0.88 |
|
వీపనగండ్ల |
1 |
1.50 |
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS): ప్రమాదవశాత్తు మరణించిన సంఘ సభ్యుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తోంది. శాశ్వత వైకల్యానికి రూ.5.00 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు అందిస్తుంది.
చేపపిల్లల పంపిణీ కార్యక్రమం: జిల్లాలోని రిజర్వాయర్లు /చెరువులకు గాను మత్స్యకారుల జీవనోపాధి కోసం గరిష్ట చేపల ఉత్పత్తిని సాధించేందుకు ప్రభుత్వం 100% ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం చేప పిల్లల వివరాలు:
|
సంవత్సరం |
పంపిణీ చేసిన మొత్తం చేప పిల్లలు |
చెరువుల సంఖ్య |
|
2021-22 |
23579750 |
1084 |
|
2022-23 |
22474150 |
980 |
|
2023-24 |
21759240 |
892 |
|
2024-25 |
5484670 |
64 |
|
2025-26 |
11104882 |
118 |
చేపల ఉత్పత్తి: వనపర్తి జిల్లాలో చేపల ఉత్పత్తి సహజ నీటి వరనురుల ద్వారా మరియు పెంపకం ద్వారా జరుగుతుంది. పెంపకానికి చెరువులు మరియు రిజర్వాయర్లు ముఖ్యమైనవి. అదనంగా, జిల్లాలో సుమారు 83 మంది ఆక్వాకల్చర్ ద్వారా అధిక సాంద్రత పద్దతిలో చేపల పెంపకం చేస్తున్నారు. కృష్ణా నది మరియు శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాంతం నుంచి కూడా సహజ సిద్దంగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. జిల్లా చేపల ఉత్పత్తి వివరాలు:
|
సంవత్సరం |
మొత్తం చేపలు & రొయ్యల ఉత్పత్తి (మెట్రిక్ టన్నుల్లో) |
విలువ (రూ. కోట్లలో) |
|
2021-22 |
16624 |
164.20 |
|
2022-23 |
17049 |
257.84 |
|
2023-24 |
16116 |
147.98 |
|
2024-25 |
10206 |
136.41 |
|
2025-26 |
12172 |
155.72 |
జిల్లాలో లభించే చేప జాతులు:
వనపర్తి జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు, బ్యాక్‌వాటర్ ప్రాంతాలు మరియు కృష్ణా నది నుంచి ఈ క్రింది చూయించిన చేప / రొయ్యల జాతులను అందుబాటులో ఉన్నాయి.
|
చేప / రొయ్య రకం |
పెంపకం రకం |
|
కట్లా |
ఆక్వాకల్చర్ & సహజ లభ్యత |
|
రోహు |
ఆక్వాకల్చర్ & సహజ లభ్యత |
|
మృగాల్ |
ఆక్వాకల్చర్ & సహజ లభ్యత |
|
కామన్ కార్ప్ |
ఆక్వాకల్చర్ & సహజ లభ్యత |
|
ముర్రెల్ |
సహజ లభ్యత |
|
మిస్టస్ / జెల్లా |
సహజ లభ్యత |
|
పంగాస్ జెల్లా |
ఆక్వాకల్చర్ |
|
గ్రాస్ కార్ప్ |
ఆక్వాకల్చర్ |
|
తిలాపియా |
సహజ లభ్యత |
|
తాజా నీటి రొయ్యలు |
ఆక్వాకల్చర్ |
చెరువుల లీజు: నీరు అందుబాటులో ఉన్న అన్ని చెరువులు / రిజర్వాయర్లను, జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రతి సంవత్సరం అధికార సంస్థ నిర్ణయించిన లీజు రేట్ల ప్రకారం సంబంధిత మత్స్యసహకార సంఘాలకు నామమాత్రపు లీజు ప్రాతిపదికన కేటాయించడం జరుగుతుంది..
రిజర్వాయర్లలో లైసెన్స్ ల జారీ: ప్రతి సంవత్సరం మత్స్యశాఖ శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ మరియు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల జీవనోపాధి కోసం, నామమాత్రపు రుసుముతో చేపల వేట లైసెన్సులను జారీచేయడం జరుగుతుంది.
Sd/-
జిల్లా మత్స్యశాఖ అధికారి,
వనపర్తి.