76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, 2025

ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా జిల్లా ప్రజలందరికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,ఐఏఎస్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై ఉపన్యసిస్తూ,జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తూ, పారదర్శకమైన ప్రజాపాలనను అందించి, వారి ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం స్వాతంత్ర సమరయోధురాలు సీతమ్మను శాలువా తో సత్కరించారు.ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థుల దేశభక్తి నృత్య సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును కలెక్టర్ తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.