ముగించు

ఆయిల్ ఫామ్ తోటల సాగు ప్రదర్శనపై విజ్ఞాన యాత్ర, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

Oil Farm Cultivation Exhibition
ప్రారంభం : 27/10/2021 | ముగించు : 02/11/2021

               ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
         బుధవారం వనపర్తిలోని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ తోటల సాగు ప్రదర్శనపై విజ్ఞాన యాత్ర (3) ఆర్.టి.సి. బస్సులను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు రైతులు, సాగుకు దరఖాస్తు చేసుకున్న 108 మంది విజ్ఞాన యాత్ర బస్సులో బయలుదేరారు. ఆయిల్ ఫామ్ తోటలపై రైతులు చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. రేపు ఈ రైతులందరు భద్రాచలం కొత్త గూడెం జిల్లాలోని ఆయిల్ పామ్ రైతులతో ముఖాముఖి చర్చించి, ఆ జిల్లాలోని ఆయిల్ పామ్ సాగవుతున్న క్షేత్రాలను సందర్శిస్తారు. అశ్వారావుపేటలోని ఆయిల్ పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించి, సాగు విధానాలను తెలుసుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు.