ముగించు

“ఆపరేషన్ స్మైల్ – IX ” కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలపై అవగాహన:

1
ప్రారంభం : 09/01/2023 | ముగించు : 28/02/2023

బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం  “ఆపరేషన్ స్మైల్ – IX ” పేరుతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ సూచించారు.
      సోమవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “ఆపరేషన్ స్మైల్” కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు జనవరి 1వ తేది నుండి నెల రోజుల పాటు “ఆపరేషన్ స్మైల్” పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. అమ్మాయిలకు 18 సం.లు, అబ్బాయిలకు 21 సం.లు కంటే తక్కువగా వయస్సు కలిగి వున్న వారికి వివాహం చేసినట్లయితే అది చట్ట రీత్యా నేరమని, బాల్య వివాహా నిషేధ చట్టం -2006, లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం – 2012 ద్వారా వారి తల్లి దండ్రులు, సంరక్షకులకు 10 సం.ల జైలు శిక్షకు అర్హులు అవుతారని, లక్ష రూపాయల జరిమానా విధించ బడవచ్చుమని ఆయన తెలిపారు.
    ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని పుష్పాలత మాట్లాడుతూ “ఆపరేషన్ స్మైల్” కార్యక్రమంలో 7 శాఖలు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించటం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీస్, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్, సి.డి.పి. ఓ, బాలల సంరక్షణ అధికారి, సి.డబ్ల్యూ.సి. శాఖలు పని చేస్తున్నట్లు ఆమె సూచించారు. బాల్య వివాహాలు రద్దు చేసేందుకు అధికారులకు సమాచారం అందించటం, బాల్య వివాహాల లో పాల్గొనకుండా వుండాలని, పిల్లల్లో విద్య నైపుణ్యాలు వృద్ది చేయటం, పిల్లల ద్వారా తల్లి దండ్రులకు సలహాలు అందించటం ద్వారా అరికట్టే వచ్చునని ఆమె అన్నారు.
    బాల్య వివాహాలు చేసినట్లయితే పిల్లల తల్లి దండ్రులు, సంరక్షకులు శిక్షకు అర్హులు అవుతారని, వారితో పాటుగా వరుడు, పూజారి, మధ్యవర్తులు, పెళ్లి పెద్దలు, బాల్య వివాహాలకు సహకరించిన, పాల్గొన్న వారందరూ శిక్షకు అర్హులు అవుతారని ఆమె తెలిపారు. బాలలకు అదైన ఆపద వచ్చినప్పుడు టోల్ ఫ్రీ (1098) నెంబర్ కు, మహిళలకు (181) హెల్ప్ లైన్ కు కాల్ చేసి తమ సమాచారం అందించాలని ఆమె సూచించారు.

అనంతరం ఆపరేషన్ స్మైల్ “బాల్య వివాహం అంటే బాలల వేధింపే” గోడ పత్రికను జిల్లా అధికారులతో కలిసి ఆయన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని పుష్పాలత, సి.డబ్ల్యూ.సి,  అలి వేలమ్మ సి.డి.పి.ఓ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, జిల్లా అధికారులు,