ముగించు

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా హిందీ కవితా పుస్తకాన్నిఆవిష్కరించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

Hindi poetry as part of
ప్రారంభం : 07/02/2022 | ముగించు : 13/02/2022

   75 సం.ల స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
        సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా హిందీ అధ్యాపక్ మంచ్ – తెలంగాణ, పండిత పరిషత్, వనపర్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సేకరించిన 75 కవితలతో కూడిన హిందీ కవితా పుస్తకాన్ని జిల్లా కలెక్టర్  షేక్ యాష్మిన్ భాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని పెంచే విధంగా వ్రాసిన కవితలు విద్యార్థులకు, భావితరాల వారికి స్ఫూర్తిని నింపుతాయని ఆమె అన్నారు.
      ఈ కార్యక్రమంలో డీఈవో. రవిందర్, హిందీ అధ్యాపక్ మంచ్ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు అక్తర్ పాషా, అలీం, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, వనపర్తి జిల్లా శాఖ ఉపాధ్యాయులు సుధాకరా చారి, తాజుద్దిన్ , సైదుదిన్, సూజాత, పరుశురాం, శేఖర్, రాజుగౌడ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.