ముగించు

వనపర్తి మునిసిపాలిటీ

పురపాలక సంఘ కార్యాలయం :: వనపర్తి

          వనపర్తి జిల్లాలోని వనపర్తి పట్టణం మూడవ శ్రేణి పురపాలక సంఘముగా తేది.05.05.1984 రోజున ఏర్పడినది. ఈ పురపాలక సంఘం యందు 2011 సెన్సెస్ ప్రకారం పట్టణ జనాభా 70,416 గా వున్నది మొత్తం హౌజ్ హోల్డ్స్ 17,382 కలవు. ఈ పట్టణ వైశాల్యం 52.45 చదరపు మీటర్లుగా కలదు.  మరియు పట్టణాన్ని 33 వార్డులుగా విభజించడమైనది. పట్టణ పరిసర గ్రామాలైన  నాగవరం, రాజనగరం, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం ప్రాంతాలు తేది 14.03.2019 నాడు వనపర్తి మునిసిపాలిటిలో విలీనం కాబడినవి.

 ఎ)     అభివృద్ధి పనులు :

          వనపర్తి పట్టణములోని వివిధ వార్డుల యందు అభివృద్ధి పనులు అనగా మురుగు కాలువలు మరియు సి.సి. రోడ్ల నిర్మానములకు మునిసిపల్ జనరల్ ఫండ్ మరియు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 కోట్లతో పనులు పూర్తి చేయడం జరిగింది. మరియు రూ. 2.74 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టుటకు  ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. 

          వనపర్తి పట్టణం నాగవరం శివారు దగ్గర గల సర్వే నెం.200 యందు 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా  డంపింగ్ యార్డు నిర్మాణమునకు రూ.100.00 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేయగా అందులో రూ.  44.00 లక్షలకు సంబంధించిన పని పురోగతిలో వున్నది.

         వనపర్తి పట్టణములోని  ఎస్.సి.  ఎస్. టి. ఏరియా ల అభివృద్ధి నకు రూ.1.69 కోట్లతో వివిధ అభివృద్ధి  పనులకు ప్రతిపాదనలు తయారు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది.

         వనపర్తి పట్టణములోని కందకం యందు సమీకృత కూరగాయలు మరియు మాంసం మార్కెట్ల  నిర్మాణములకు సంబంధించి బ్యాలెన్సు పనులకు ప్రభుత్వ జి.ఓ.ఏం.ఎస్. నెం.218, తేది. 29.3.2018   ద్వారా రూ. 5.00 కోట్లు మంజూరు కాబడినవి. ఇట్టి పని నిర్మాణ దశలో వున్నది.

         వనపర్తి పట్టణం యందు గల వైకుంఠ ధామం  అభివృద్ధి నకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.23  కోట్లతో 3 పనులకు గాను 3 పనులు పూర్తి చేయడం జరిగింది.

         వనపర్తి పట్టణ పరిధిలోని నాగవరం డంపింగ్ యార్డు గుట్ట దగ్గర సర్వే నెం.200 లో Faucal Sludge Treatment Plant (FSTP) కొరకు స్థలాన్ని సేకరించడం జరిగింది. అట్టి దానిని లెవెలింగ్ చేయడం జరిగింది.

           వనపర్తి పట్టణ పరిధిలోని నాగవరం యందు సర్వే నెం.200 యందు ఒక ఎకరా భూమిలో జంతువుల  సంరక్షణ కేంద్రాన్ని పట్టణ ప్రగతి నిధులు రూ.లు 0.50 కోట్లతో చేపట్టడం జరిగింది.

టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు :

          వనపర్తి పట్టణ పరిధిలోని శ్రీనివాసపురం యందు సర్వే నెం.55 నందు సమీకృత కూరగాయలు మరియు  మాంసం మార్కెట్ల నిర్మాణములను టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.లు 4.50 కోట్లతో చేపట్ట వలసి  యున్నది. ఇట్టి స్థలం పట్టణానికి దూరంగా ఉన్నందున ప్రత్యన్మయ స్థల సేకరణ చేయవలసి యున్నది.

          వనపర్తి పట్టణ పరిధిలోని నాగవరం యందు సర్వే నెం.200 మరియు రాజానగరం యందు సర్వే నెం.248 లలో  వైకుంఠ ధామం నిర్మాణములను టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.లు 2.00 కోట్లతో  చేపట్ట వలసి యున్నది.

          వనపర్తి పట్టణము యందు 6  పార్కులు అనగా 1) నాయక్ పార్కు 2) సవరన్ వీధి పార్కి 3)  ఇ-సేవ పార్కు 4) న్యూ టౌన్ కాలనీ పార్కు 5) వెంగల్ రావు నగర్ కాలనీ పార్కు 6) కె.డి.ఆర్. హనుమాన్ టెంపుల్ పార్కు ల అభివృద్ధినకు రూ. 100.00 లక్షలు పనులు పురోగతిలో వున్నవి. 

           వనపర్తి పట్టణం యందు గోపాల్ పేట రోడ్డు, చిట్యాల రోడ్డు, పెబ్బేర్ రోడ్డు, పానుగల్ రోడ్డు యందు  సెంట్రల్  లైటింగ్ మరియు మీడియన్ ప్లాంటేషన్ ఏర్పాటుకు రూ.370.00 లక్షలు మరియు తాళ్ల చెరువు, అమ్మ చెరువు బ్యుటిఫికేషన్ నకు రూ.380.00 లక్షలకు పనులు పూరోగతిలో కలవు.

         వనపర్తి పట్టణములోని వివిధ వార్డుల యందు మురుగు కాలువల నిర్మాణము మరియు సి.సి. రోడ్ల నిర్మాణములు  చేయుటకు   రూ.262.00  లక్షలకు ప్రతిపాదనలు తయారు చేసి టెండర్  దశలో  వున్నవి.

         వనపర్తి పట్టణములోని హనుమాన్ టేకిడి యందు రూ.140.00 లక్షలతో కూరగాయల మార్కెట్ నిర్మాణదశలో వున్నది.

         వనపర్తి పట్టణములోని వివిధ వార్డుల యందు మురుగు కాలువలు,, సి.సి. రోడ్లు,  బి.టి. రోడ్ల (ప్రజా వైద్యశాల రోడ్డు, బస్సు డిపో రోడ్డు మరియు హైదరాబాద్ రోడ్డు నుండి ఖాసీం నగర్ రోడ్డు వరకు సి.సి. రోడ్డు) నిర్మాణములను రూ.311.00 లక్షలతో పనులు పూర్తి చేయడం జరిగింది. 

         వనపర్తి పట్టణం యందు వరద కాలువ (జాగృతి కాలేజ్ నుండి స్విమ్మింగ్ పూల్ వరకు మరియు సాయినగర్ కాలనీ నుండి రాజీవ్ గృహకల్ప వరకు) నిర్మాణమునకు రూ.269.00 లక్షలతో పనులు పూర్తి చేయడం జరిగింది.       

  బి)   స్వచ్చ భారత్  :

          స్వచ్చ భారత్ -స్వచ్చ తెలంగాణ కార్యక్రమములో భాగంగా పట్టణం యందు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని  గృహములను గుర్తించి అట్టి వాటి నిర్మాణం చేపట్టి వనపర్తి పట్టణమును  బహిరంగ మల మూత్ర  విసర్జన      రహిత పట్టణముగా ప్రకటించడం జరిగినది.

          స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమములో భాగంగా ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రకటించిన ర్యాంకులలో సౌత్ జోన్ లో  వనపర్తి మునిసిపాలిటి  51వ ర్యాంకు  మరియు రాష్ట్ర స్థాయి లో 6వ ర్యాంకు సాధించింది.

సి)      ఆసరా పెన్షన్లు :

          అన్ని రకాల పెన్షన్లు మొత్తం 7420 (విలీన గ్రామాలు కలిపి) వివిధ వర్గాల వారికి అందివ్వడం           జరుగుచున్నది.

డి)      త్రాగునీటి సరఫరా :

          త్రాగునీటి సరఫరా వినియోగం                       :         10  యం.ఎల్.డి.

          ఒక మనిషి  వినియోగం                              :         125 లీటర్లు

          గృహ వినియోగ నీటి కొళాయిలు                    :         9669     

          ప్రజల నీటి  కొళాయిలు                               :         238

          చేతి పంపులు                                          :         20

          పవర్ బోర్స్                                            :         220    

          నీటి సరఫరా పైప్ లైన్                                :         169 కి.మీ.

          నీటి జల భాండగారములు                           :         13

  ఇ) రహదారులు  :

          సి.సి.  రహదారులు                                   :         188.20 కి.మీ.

            బి.టి.రహదారులు                                     :         18.20 కి.మీ.

          కచ్చ రహదారులు                                    :           40 కి.మీ.

          డబ్ల్యు.బి.యం. రహదారులు                         :           2.10 కి.మీ.

                                                మొత్తం              :           248.50 కి.మీ.

ఎఫ్)హరిత హారం :

హరిత హారం కార్యక్రమంలో భాగంగా వనపర్తి మునిసిపాలిటి పరిధిలో 33  ట్రీ పార్కులకు గాను 21  ట్రీ పార్కులను ఏర్పాటు చేయడం జరిగినది. మిగతా 12 ట్రీ పార్కులు  పూరోగతిలో కలవు.

నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బృహుత్ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది.

వనపర్తి పట్టణం యందు చేపట్టిన 7వ విడత హరిత హారం కార్యక్రమానికి పట్టణములోని  మహిళ సంఘాల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరిగింది.

జి)మెప్మా :

వనపర్తి జిల్లాలో మొత్తం 5 మునిసిపాలిటిలు అనగా 1) వనపర్తి 2) ఆత్మకూర్ 3) అమరచింత 4) కొత్తకోట   5) పెబ్బేర్ మునిసిపాలిటిలు కలవు.  వనపర్తి జిల్లాలోని మొత్తం 5 మున్సిపాలిటీలలో  కలిపి 2163      మహిళా  స్వయం సహాయక  సంఘాలు కలవు అట్టి మహిళా సంఘాల యందు 23268 మహిళా సంఘసభ్యులు ఉన్నారు. మరియు మొత్తం 55 వికలాంగుల సంఘాలు, అట్టి సంఘాల యందు 280 మంది వికలాంగుల సంఘ  సభ్యులు ఉన్నారు. మరియు జిల్లలో 88 మహిళా స్లమ్ సమాఖ్యలు అలాగే వనపర్తి జిల్లాలో 5 మునిసిపాలిటిలలో 5  పట్టణ సమాఖ్యలు కలవు.

      జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ద్వార 40 సమాఖ్యలలో 80  మహిళా ఆరోగ్య సమితి లను ఏర్పాటు  చేయడమైనది. వీరి ద్వారా మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిల పరిధిలో వీధి విక్రయదారులకు ఆత్మ నిర్భార్ పథకం ద్వారా ఋణం  మంజురునకు సర్వే చేపట్టి 6265 మందిని గుర్తించి అట్టి  వీధి విక్రయదారుల వివరములను పి.ఎం. స్వానిది   ఆన్ లైన్ పోర్టల్ యందు నమోదు చేయడం జరిగింది. తదుపరి 4575 మంది  వీధి విక్రయదారులకు      ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున బ్యాంకు ఋణమును మంజూరు చేయించడం జరిగింది. అర్హత వున్నవిక్రయదారులకు 2660 లక్ష్యానికి గాను 969 మందికి  రూ. 20,000/- లోన్ మంజూరు చేయించడం జరిగినది.       

       వనపర్తి మునిసిపాలిటిలో మహిళ సంఘాల ద్వారా హరిత హారం కార్యక్రమం కొరకు 2.50 లక్షల  మొక్కల  పెంపకం చేపట్టడమైనది. మరియు మొక్కలను ఇంటింటికి పంపిణి చేయడం జరిగినది.    

 2022-2023 సంవత్సరంలో వనపర్తి జిల్లాలోని 5 మునిసిపాలిటిలలో 255 మహిళ సంఘాలకు రూ. 779.11 లక్షల బ్యాంకు లింకేజి రుణాల లక్ష్యానికి గాను 93 మహిళ సంఘాలకు రూ. 635.50 లక్షల   బ్యాంకు లింకేజి రుణాలను మంజూరు చేయించడం జరిగింది. వనపర్తి జిల్లా రుణాల మంజూరులో 81.56%           లక్ష్యాన్ని చేరుకొని కొనసాగడం జరుగుచున్నది.

హెచ్)  బస్తి దావఖానలు   :

ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పట్టణం యందు కె.డి.ఆర్.నగర్ వాటర్ ట్యాంక్ (CRC Building) దగ్గర బస్తి దవఖాన ఏర్పాటు చేయనైనది.

ఐ)      తెలంగాణా క్రీడా ప్రాంగణాలు (టి.కె.పి.)  :

          తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పట్టణములోని 33 వార్డుల యందు క్రీడా ప్రాంగణాలు   ఏర్పాటు చేయవలసి ఉన్నందున ప్రస్తుతం పట్టణం యందు 4 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం     జరిగింది.

జె)      వాహనాల కొనుగోలు  :

వైకుంఠ రథం, రెండు (2) వాటర్ ట్యాంకర్లు, జె.సి.బి., చెత్త సేకరణ పది (10) ఆటోల కొనుగోలుకు టెండర్ ప్రక్రియలో    వున్నది.

వెబ్సైట్:https://wanaparthymunicipality.telangana.gov.in/