ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA)

సంస్థాగత నిర్మాణం (IB) :

జిల్లా లోని మొత్తము మండల మహిళా సమాఖ్య ల సంఖ్య (MMS)

14

జిల్లా లోని మొత్తము గ్రామ సంఘాల సంఖ్య (VO)

343

జిల్లా లోని మొత్తము  స్వయం సహాయక సంఘాల సంఖ్య (SHG)

7,320

జిల్లా లోని మొత్తము  స్వయం సహాయక సంఘాల  సభ్యుల సంఖ్య

86,373

SHG బ్యాంక్ లింకేజి  :

 

ఆర్థిక

సంవత్సరం

లక్ష్యం

సాధించిన ప్రగతి

%

మొత్తము సంఘాల సంఖ్య

(SHGs)

అమౌంట్

(రూ.కొట్లలో)

 

మొత్తము సంఘాల సంఖ్య

(SHGs)

అమౌంట్

(రూ.కొట్లలో)

 

1

2

3

4

5

6

2022-23

6115

251.70

1466

94.20

37.43

పావలా వడ్డిల రిపోర్ట్ .

Sl.No

Year

No.of SHGs

Amount  

 ( Rs. in Lakhs)

1

2016-17

6035

428.81

2

2017-18

6374

479.01

3

2018-19

5405

500.28

మార్కెటింగ్  (యాసంగి(2021-22) :

Sl. No

Particulars

Achievement

1

జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబించిన మండలాల సంఖ్య

14

2

జిల్లా లో ప్రారంబించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య

60

3

వరిధాన్యం కొనుగోలు చేసిన రైతుల సంఖ్య

6481

4

కొనుగోలు చేసిన ధాన్యం (క్వింటాల్లో)

3,44,322.72

5

కొనుగోలు చేసిన ధాన్యం విలువ  (రూ.కొట్లలో)

67.42 Cr.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము :

  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతకము ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 08 లక్షల పనిదినాలు కల్పించటం జరిగింది. ఇందుకు గాను 50.46 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. అందులో కూలీ వేతనాలకు 37.39 కోట్లు. మరియు 341 కూలీ కుటుంబాలకు 100 రోజులు పని కల్పించటం జరిగింది.
  • ఉపాధి హామీ పథకము ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తము 17012 పనులను మంజూరి చేయగా వాటిలో పల్లె ప్రకృతి వనాలు, రైతు కల్లాలు, సేగ్రిగేషన్ షెడ్డులు, వ్యక్తిగత/కమ్యూనిటి ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డ్ లు, గొర్రెల, పశువుల పాకలు, నీటి గుంటలు, కోళ్ళ షెడ్ లు, స్కూల్ వంట గదులు, స్కూల్ టాయిలెట్స్, వైకుంఠ ధామాలు, అంగన్వాడి స్కూల్ టాయిలెట్లు మరియు వివిధ రకాల పనులకు గానూ 13174 పనులు చేపట్టి 3787 పనులు పూర్తి చేయడం జరిగింది. ఇందుకు గాను రూ. 82 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.
  • జిల్లాలోని మొత్తము 255 గ్రామ పంచాయితీ లలో సేగ్రిగేషన్ షెడ్డుల నిర్మాణం పూర్తి అయినది మరియు 277 రైతు కల్లాలు పూర్తి చేయడం జరిగినది.
  • తెలంగాణకు హరితహారం లో బాగంగా 2021-22 సంవత్సరంలో ప్రతి గ్రామ పంచాయితీలో ఓక నర్సరీని పెంచుటకు లక్షంగా తీసుకొని 255 నర్సారీలకు గాను ఇప్పటి వరకు 255 నర్సరీలలో 20 లక్షల మొక్కలు పెంచడం జరిగినది.
  • 2022-23 సంవత్సరంలో పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ లక్ష్యం 62 లక్షలుగా నిర్ణయించడమైనది. అందులో 25.10 లక్షల మొక్కలు నాటడం జరిగినది.
  • 2021-22 సంవత్సరంలో జిల్లాలోని అన్ని గ్రామాలు, ఆవాసములు కలుపుకొని మొత్తం 321 పల్లె ప్రకృతి వనాలు పెంచడం జరిగింది.
  • తెలంగాణకు హరితహారంలో బాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనలను (70) పెంచుటకు లక్షంగా తీసుకొని అందులో 68 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయినవి. మిగతా 02 ప్రకృతి వనాలలో మొక్కలు నాటడం పురోగతిలో ఉన్నవి.
  • 2022-23 సంవత్సరంలో పండ్ల తోటల పెంపకములో బాగంగా 1500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడమైనది. అందులో 1062 ఎకరాలలో అంచనాలు తయారు చేసి 504 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగినది మిగతా లక్ష్యం పురోగతిలో ఉన్నది.
  • 2021-22 సంవత్సరంలో తెలంగాణకు హరితహారంలోని బాగంగా NH-44 లో 3 KM లలో 28885 మొక్కలు నాటడం జరిగినది.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు :

  • తెలంగాణా క్రీడా ప్రాంగణంలో బాగంగా 319 పనులకు గాను ఇప్పటివరకు 153 పనులు పూర్తి చేయడమైనది, 28 క్రీడా ప్రాంగణం పనులు పురోగతిలో ఉన్నవి.

వాటర్ షెడ్ పథకము  :

  • వాటర్ షెడ్ పతకము ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 1353 పనులకు 4 కోట్ల 95 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మరియు వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల కొరకు 80 లక్షలు ఖర్చు చేయడం జరిగింది.

ముఖ్య మంత్రి గిరి వికాసము పథకము :

  • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తము 912 పనులకు గాను 17 లక్షల విలువ గల పనులకు పరిపాలన ఆమోదము తీసుకొని అందులో 520 పనులను పూర్తి చేసి 500.17 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి.

స్వచ్చ భారత్ మిషన్  :

  • స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేస్ -II పల్లె ప్రగతి 5వ విడత లో భాగంగా అన్ని గ్రామాలలో సర్వే నిర్వహించి మరుగుదొడ్లు లేని 2966 ఇండ్లను గుర్తించడం జరిగింది. 2966 మరుగుదొడ్ల కు గాను, 2022-23 సంవత్సరానికి 1450 మరుగుదొడ్ల కు మంజూరు ఇవ్వటం జరిగంది దీని అయ్యే ఖర్చు 74 లక్షలు.