ముగించు

సర్వే మరియు భూమి రికార్డులు కార్యాలయం

సర్వే (survey) :  సర్వే అనగా ఏదయిన విషయం గురించి కానీ ,వస్తువు గురించి కానీ సమగ్రమైన పూర్తి వివరాలు సేకరించి శాస్త్రియ  బద్దంగా ఇట్టి వివరములను భధ్రపరచడము.

          అలాగే భూమికి సంబందించిన వివరములు రైతుల వారిగా అనగా ప్రతి రైతు యొక్క భూమి హద్దులు ,వాటి కొలతలు,విస్తీర్ణం ,పటము,భౌగోలిక గుర్తులు,భూమి తరము ,దాని మీద శిస్తు మొదలగు భూ వివరములు అన్నియూ సేకరించి చట్ట పరంగా భద్రపరుచుదాన్నే మనం  భూమికి సంబందించిన “సర్వే” అని అంటాము.

ఆవశ్యకత (Necessity&Importence) :

                             ప్రతి రైతుకు సంబందించిన,ప్రభుత్వనికి సంబందించిన భూముల హద్దులు నిర్ణయిoచుట ,ప్రభుత్వ భూములు పరిరక్షణ ,ప్రభుత్వేతర అనగా పట్టాదారుల నుండి న్యాయపరమైన శిస్తును ప్రభుత్వ ఖజానాకు రాబట్టుట ,అలాగే రోజువారీ కార్యక్రమములో వారి మధ్య ఏమయినా భూవివాదములు తలెత్తినప్పుడు సర్వే చేసిన రికార్డులు ఆధారంగా వారికీ సరియైన ,చట్టపరమైన న్యాయo .రక్షణ కల్పించుట ,అలాగే పంటల వివరములు ప్రభుత్వము తెలిసికొనుటకు చాలా ఉపయోగపడుతుంది.

  సర్వే పరికరములు (survey instruments):

                                మనము పొలముల యొక్క కొలతలు చేయుటకు కొన్ని పరికరాలు ఉపయోగిస్తాము.

  (1) గొలుసు (2) క్రాస్ స్టాఫ్ (3) మేకులు (4) జెండాలు (flgs)

(1) గొలుసు: రెండు స్థానముల మధ్య దూరమును కొలుచుటకు గాను “గొలుసు”అను పరికరమును ఉపయోగిస్తాము.గొలుసు లింకులు అనబడు (100) సమభాగాములుగ విభజించబడుతుంది.దీని మొత్తము పొడవు20 మీటర్లు .ఒక లింకు20 సెం.మీ కలిగి యుంటుంది.  

(2) క్రాస్ స్టాఫ్ : దీనితో 90 కోణమును ఏర్పాటు చేయుటకు లంబకోణము ఎచ్చటైన ఏర్పాటు చేయుటకువీలు అగును .దీని ప్రధాన భాగములు  రెండు (1) ఇనుప ఊచ (2) కొయ్య దిమ్మె .

కొయ్య దిమ్మె(తల భాగము) 4”అంగుళములు చదరము , 2 ½” అంగుళములు దళసరి కలిగి యుండును. తల భాగముపై ½”అంగుళము లోతు సమభాగాములు(4) గా ఏర్పాడేటట్లు 90 సమ కోణమును వచ్చు లాగున (2) గాడులు రంపముతో కోయబడి ఉండును .

(3) మేకులు : ఇది సుమారు 1’ అడుగు నుండి 1 1/2’ అడుగు అనగా 30 నుండి 45 సెం.మీ పొడవు కలిగి రేఖ యొక్క పొడవు ఎన్ని గొలుసులు దూరం కొలిచినది సులభంగా తెలుసుకొనుటకు.

(4) జెండాలు : సరిహద్దులు ,భూముల వంపులు సులభంగా గుర్తించుటకు.

డ్రాయింగ్ పరికరములు (Drawing instruments)

      • స్కేల్ (2) మెట్రిక్ స్కేల్ (3) తెలంగాణా  స్కేల్

నిర్వహణ:

R.R.R(రెవెన్యూ రికార్డులు మరియు నమోదు):

సర్వే డిపార్టుమెంటు సర్వే పనులు చేసి తగు రికార్డ్లు తయారు చేసి రెవెన్యూ శాఖా వారికీ అందజేయడము జరుగుతుంది .తరువాత వాటి ఆధారముగా దైనందిన పరిపాలనలో వచ్చు మార్పులు చేర్పులు సరిచేసి నవీనముగా ఉండునట్లు చేయుటను R.R.R మెంటేనేన్స్ అంటారు.

రెవెన్యూరికార్డులను నవీనముగాచేయుటలో రోజువారీ రికార్డులు సరిగా ఉండే విధముగా చేయుటలో ఈ క్రింది అంశములు ఎప్పుడు పరిశీలించాలి.

      • సర్వే సరిహద్దులు
      •  భూమి కొలతల పుస్తకము
      •  గ్రామ పటము
      •  సెటిల్మెంట్ రిజిస్టర్

జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల విధులు, వనపర్తి

జిల్లా పేరు: – వనపర్తి
రెవెన్యూ విభాగాల సంఖ్య: – 01
మండల సంఖ్య: – 14
రెవెన్యూ గ్రామాల సంఖ్య: – 223

జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం భూమి రికార్డులను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి ఒక భూ సర్వే. సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం లేదా పట్టా యొక్క భూములను మండల స్థాయి, డివిజనల్ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో గుర్తించడం.

ఈ కార్యాలయంలో పొందుపరిచిన రచనలు క్రిందివి.

      1.  ఎఫ్ – లైన్ పిటిషన్లు (పట్టా & ప్రభుత్వ భూముల సరిహద్దు)
      2.  అసైన్మెంట్ సబ్ డివిజన్ పని.
      3.  భూసేకరణ పనులు.
      4.  భూమి పరాయీకరణ పని.
      5.  పట్టా ల్యాండ్ సబ్ డివిజన్ పని.
      6. సర్టిఫైడ్ కాపీల జారీ
        • టిప్పన్స్ కాపీ
        • సేత్వర్స్
        • అనుబంధ సేత్వార్లు
        • వాసూల్ బాకి
        • గ్రామ పటాలు
      7. అనుబంధ సేత్వార్ల తయారీ.
      8. కోర్టు కేసులకు హాజరు (భూ వివాద విషయాలకు)
      9. దిద్దుబాటు కేసులకు హాజరు
        • పట్టాదార్ పేరు మిస్-స్పెల్లింగ్ అయితే
        • సర్వే సంఖ్యల ఇంటర్ మార్పులో.
        • సర్వే మ్యాప్‌లో సర్వే నంబర్ లేదు
        • ఏరియా దిద్దుబాటు ఉంటే
        • మ్యాప్‌లో ప్లాటింగ్ లోపం ఉంటే.
      10. గ్రామ సరిహద్దు వివాదం.
      11. భూమికి సంబంధించిన ప్రతి ప్రభుత్వ పనులకు ఈ కార్యాలయ సిబ్బంది హాజరవుతారు

సర్వే రికార్డుల స్థితి:

క్రమసంఖ్య జిల్లా పేరు గ్రామాల మొత్తం సంఖ్య గ్రామ పటాలు FMBలు/టిప్పన్లు RSR / సేత్వార్స్ వ్యాఖ్యలు
మొత్తం  అందుబాటులో ఉంది తప్పిపోయింది స్కాన్ చేయబడింది % తప్పిపోయింది మొత్తం  అందుబాటులో ఉంది తప్పిపోయింది స్కాన్ చేయబడింది % తప్పిపోయింది మొత్తం  అందుబాటులో ఉంది తప్పిపోయింది స్కాన్ చేయబడింది % తప్పిపోయింది
1 వనపర్తి 224 224 220 (02) Missing
(02) Torn
Condition
220   86092 67921 18179 67921 22% 224 180 44 141 19% మిగిలిన 43 మంది సేత్వార్‌ల పరిస్థితి విషమంగా ఉంది

సిబ్బంది వివరాలు కేడర్ వారీగా

      • ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే (జిల్లా.సర్వే అధికారి)
      • డిప్యూటీ.ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే
      • సర్వేయర్ల
      • డిప్యూటీ.సర్వేఏర్స్
      • సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్
      • కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్ Gr-I
      • కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్ Gr-II
      • సీనియర్ అసిస్టెంట్
      • జూనియర్ అసిస్టెంట్
      • టైపిస్ట్
      • చైర్మన్
      • ఆఫీస్ సబార్డినేట్

సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ సిబ్బంది:

ఉద్యోగి పేరు
హోదా
సెల్.నం.
జె.బాల కృష్ణ-
 
సర్వే ఇన్స్పెక్టర్
9490975339/8712656028
 
A.నిర్మలాభాయ్
సర్వేయర్
7893328077
MD శాఫుల్ల
సర్వేయర్
9951139503
M.వెంకటేశ్వర్ రెడ్డి
సర్వేయర్
8500496099
K.వీనారాణి
సర్వేయర్
9010406216
ఎం.వసంత సర్వేయర్ 9493233417
J.పెన్నయ్య
సర్వేయర్
9493363027
G.భాస్కర్
సర్వేయర్
9494017665
M.వెంకటేష్
సర్వేయర్
7780184712
పి.స్వాతి సర్వేయర్ 8688650716
ఎం.సుమలత సర్వేయర్ 9505525620
G.చిరంజీవి
డి.సర్వేయర్
9550820808
C.శ్రీనివాస్ యాదవ్
డి.సర్వేయర్
9440794217
G.వికాస్
డి.సర్వేయర్
9030424362
M.పాండు కుమార్
డి.సర్వేయర్
9494268357
G.నవీన్ కుమార్ రెడ్డి
డి.సర్వేయర్
8639863660
R.సుచరిత
డి.సర్వేయర్
8184901045
V.శిల్పా
ఎస్ డి ఎం
9948780803
పి.శ్రీకాంత్
సినియర్.అసిస్టెంట్
9948759667
MD సలీమ్ పాషా
జూనియర్.అసిస్టెంట్
8978361364
G.చరణ్ కుమార్
టైపిస్ట్
9000554431
Md. రహీముద్దీన్
చైన్‌మ్యాన్
9885625527
జి.సౌభాగ్య   9441374191
G.లక్ష్మీదేవి
ఆఫీస్ సబర్దినేట్
9032101417

ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే (FAC) జిల్లా సర్వే & భూమి రికార్డ్స్, వనపర్తి. ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం ఈ క్రింది URL కి వెళ్లండి:

http://ccla.telangana.gov.in/