మిషన్ భగీరథ కార్యాలయం
లక్ష్యం:
ఇంటింటికి సురక్షిత త్రాగు నీరు అందించాలనే బృహతర్ర ఆశయం తో ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ ప్రాజెక్టు ను గౌII ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేకర్ రావు గారి ఆలోచన మేరకు తెలంగాణా ప్రభుత్వం చేపట్టింది. కలుషిత నీరు త్రాగడం వల్ల కలిగే వ్యాధుల భారం తగ్గించేందుకు ప్రజలకు త్రాగునీటి కష్టాలు తగ్గించేందుకు ప్రజల జీవన ప్రమణాలు పెంచేందుకు ఉద్ద్యేశించిన ప్రాజెక్టు మిషన్ భగీరథ.
ఏ ఒక్క కుటుంబము మిగిలిపోకుండా ప్రతీ గడపకు చాలినంత నీటి ని అందించేందుకు అత్యంత సమగ్రంగా నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టు లో భాగంగా గ్రామీణ ప్రాంతాల లోని కుటుంబాలకు తలసరి 100లీII ( ఎల్.పి.సి.డి) , పట్టణ ప్రాంతాలలో 135 ఎల్.పి.సి.డి చొప్పున . నగర ప్రాంతాలలో 150 ఎల్.పి.సి.డి చొప్పున నీరందించాలనీ , అదేవిధంగా ఈ ప్రాజెక్టు లోని నీటి లభ్యత 10% భాగాన్ని పరిశ్రమలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆవశ్యకత:
దక్షిణ భారతదేశం లోని రెండు ప్రధాన నదులు , కృష్ణ , గోదావరి తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నప్పట్టికీ , ప్రజలు 82% శాతం భూగర్భ జలాల పై ఆధార పడుతున్నారు . దీని వల్ల భూగర్భజల సంపద తగ్గడమే కాక అధిక సాంద్రతర ఖనిజలవణాలు కూడా కలిసి త్రాగేందుకు ఉపయోగ పడకుండా తయారవుతున్నది.
దాదాపు ప్రతి రెండేళ్లకొకసారి కరువు , రాష్ట్రాన్ని పలకరిస్తూనే వుంది. కరువు కాటకాల సమయం లో , భూగర్భ జలాల మట్టం మరింత లోతుకు దిగజారుతూ ఉంది.
భూగర్భ జలాల మట్టం దిగజారుతూ ఉండటం వల్ల , ఫ్లోరైడ్ , ఐరన్ వంటి ఖనిజాల సాంద్రత నీటిలో పెరిగిపోవడం , ఆనీళ్ళు త్రాగడం వల్ల ప్రజలకు రకరకాలైన వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది .
WHO మరియు భారత ప్రభుత్వం రెండూ కూడా భూగర్భజలాల వాడకాన్ని తగ్గించి ఉపరితల నీటి వనరుల వాడకానికి మారాలని ప్రజలకు హెచ్చరికతో కూడిన సూచనలను జారీ చేసాయి.
శాఖ వివరాలు :
ప్రభుత్వం 11.10.2016న కొత్త జిల్లాల ఏర్పాటు/పునర్వ్యవస్థీకరణ సమయంలో జిల్లా మొత్తానికి ఒక డివిజన్ మరియు సబ్ డివిజన్ వనపర్తి ఏర్పడింది. జనవరి 2017లో మరో రెండు కొత్త సబ్ డివిజన్లు ఏర్పడ్డాయి – కొత్తకోట మరియు పెబ్బేరు సబ్ డివిజన్లు.
G.O.Ms. No: 122 Dt: 21.12.2018 ప్రకారం, తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ నీటి సరఫరా & పారిశుధ్య శాఖ (ఆర్. డబ్ల్యు.ఎస్&ఎస్) ను మిషన్ భగీరథ గా మార్చడం జరిగినది .
సంక్షిప్త సమాచారం:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ.దీని ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాలను అతి తక్కువగా వాడుతూ,నమ్మ దగిన ఉపరితల జలాశయాలనుండి సేకరించిన నీటిని శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ప్రతిరోజు అందించాలి.
మిషన్ భగీరథ కింద, వనపర్తి జిల్లా క్రింద వివరించిన విధంగా మూడు ఉప విభాగాల ద్వారా కవర్ చేయబడుతుంది
- వనపర్తి
- బాలకిష్టాపూర్
- కొల్లాపూర్
సంప్రదింపు వివరాలు:
అధికారి పేరు: టి మేఘా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,(ఇంట్రా & గ్రిడ్) విభాగం, వనపర్తి.
మొబైల్ నంబర్ : 9100122247
9100120593