ముగించు

అమర్చింత మునిసిపాలిటీ

 పురపాలక సంఘ కార్యాలయం :: అమరచింత  

NOTES ON DEVELOPMENTAL ACTIVITIES

 వనపర్తి జిల్లాలోని అమరచింత   పట్టణం మూడవ శ్రేణి పురపాలక సంఘముగా తేది.02.08.2018 రోజున ఏర్పడినది. ఈ పురపాలక సంఘం యందు 2011 సెన్సెస్ ప్రకారం పట్టణ జనాభా 11225 గా వున్నది మొత్తం హౌజ్ హోల్డ్స్ 3008 కలవు మరియు ఈ పట్టణ వైశాల్యం 18.96 చదరపు కిలో మీటర్లు మరియు 10 వార్డులుగా విభజించబడినది.

ఎ)      అభివృద్ధి పనులు :

  • అమరచింత  పట్టణం యందు SFC (పట్టణ ప్రగతి)  నిధుల ద్వారా రూ. 8.12 లక్షలు ఖర్చు

చేయడం  2023-24  వ సంవత్సరంలో  పారిశుద్య నిర్వహణకు మరియు  తాగు నీటి సరఫరాకు జరిగింది.

  • రూ.1.29 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
  • రూ.50.00 లక్షల నిధులతో వైకుంఠధామం నిర్మాణ పనులు 50% పనులు పూర్తి కావడం జరిగినది
  • SFC (పట్టణ ప్రగతి) నిధుల నుండి 45 (ఒక కోటి నలభై ఐదు లక్షల) 2021-2022 వ సంవత్సరంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు పూర్తి కావడం జరిగినది.
  • 03 పబ్లిక్ పార్కులు, 7 పబ్లిక్ టాయిలెట్స్ వివిధ వార్డుల నందు పూర్తి కావడం జరిగినది,
  • రూ.00 లక్షల వ్యయంతో పురపాలక సంఘం కార్యాలయం నిర్మించడం జరిగినది.
  • CM అస్సురేనెస్ నిధుల నుండి విడుదల అయిన 50.00 లక్షల పట్టణంలో సి.సి. రోడ్డులు పనులు పూర్తి కావడం జరిగినది.
  • TUFIDC నిధుల నుండి విడుదలైన 5 కోట్ల బడ్జెట్ తో పట్టణంలో సి.సి. రోడ్డులు పనులు పూర్తి కావడం జరిగినది. మరియు సి.సి డ్రైనేజ్ పనులు పురోగతిలో ఉన్నాయి.
  • పట్టణంలో వివిధ వార్డుల నందు 6 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేయడం జరిగినది.
  • మాల వ్యర్థ నిర్వహణ కేంద్రాలు (FSTP) పనులు మస్తిపూరం X రోడ్డు దగ్గర నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
  • పట్టణంలోని నగరాభివృద్ధి నిధులలో ప్రతి వార్డు నందు 7.70 కోట్ల సిసి రోడ్డు లు మరియు 3.10 కోట్ల సిసి డ్రైన్ల మరియు జంక్షన్ అభివృద్ధి కొరకు 90 లక్షలు పార్క్ అభివృద్ధి కొరకు 1.00 కోటి రూపాయలు కలవర్ట్ ల కొరకు 30 లక్షలు మరియు మల్టీ పర్పస్ బిల్డింగ్ కొరకు 2.00 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగినది.

  బి)   ఆసరా పెన్షన్లు :                     

క్ర. స

పెన్షన్ రకం

మొత్తం పెన్షనర్లు

1

వృద్ధాప్య

815

2

వితంతువు

1017

3

వికలాంగులు

294

4

టుడే టాపర్

12

5

చేనేత

224

6

బీడీ

377

7

ఒంటరి మహిళా

42

మొత్తం

2781

అన్ని రకాల పెన్షన్లు మొత్తం  2781 వివిధ వర్గాల వారికి అందివ్వడం జరుగుచున్నది.

సి)      త్రాగునీటి సరఫరా :

          త్రాగునీటి సరఫరా వినియోగం                       :         10  యం.ఎల్.డి.

          ఒక మనిషి  వినియోగం                                        :         125 లీటర్లు

          గృహ వినియోగ నీటి కొళాయిలు                    :         1254    

          ప్రజల నీటి  కొళాయిలు                               :         15

          చేతి పంపులు                                          :         4

          పవర్ బోర్స్                                            :         17  

          నీటి సరఫరా పైప్ లైన్                                :         25 కి.మీ.

          నీటి జల భాండములు                                :         7

డి)      రహదారులు  :

          సి.సి.  రహదారులు                                   :         14 కి.మీ.

            బి.టి.రహదారులు                                     :         1.00 కి.మీ.

          కచ్చ రహదారులు                                    :         5 కి.మీ.

          డబ్ల్యు.బి.యం. రహదారులు                         :         2.00 కి.మీ.

                                                మొత్తం              :           22.00 కి.మీ.  

)      హరిత హారం :

హరిత హారం కార్యక్రమంలో భాగంగా అమరచింత  మునిసిపాలిటి పరిదిలోని రాజావలి దర్గా దగ్గర పట్టణ ప్రకృతి వనం,  2వ వార్డ్ నందు మరియు ఎస్ సి కాలనీ ప్రాంతాలలో ట్రీ పార్కులను అదేవిధంగా 2వ వార్డ్ తండా దగ్గర, మున్సిపల్ కార్యాలయం దగ్గర నర్సరీ  ఏర్పాటు చేయడం జరిగినది. మరియు 7 వ వార్డ్ మస్తిపూరం క్రాస్ రోడ్డు దగ్గర మియా వాకి ఏర్పాటు చేయడం జరిగినది. పట్టణ శివారు వరకు ప్రదాన రహదారికి ఇరువైపులా మొక్కలను నాటడం జరిగినది. మరియు పట్టణంలో డివైడర్ కు మధ్యలో షో మొక్కలు మరియు పూల మొక్కలు నాటడం జరిగినది. 

ఈ)     టి ఎస్ బి పాస్ :

అమరచింత పట్టణంలో ఇంటి నిర్మాణం కొరకు టి ఎస్ బి పాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు 110 అందులో 110 వాటికి ఇంటి నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వడం జరిగినది మరియు  లేఅవుట్ కొరకు వచ్చిన దరఖాస్తులు 4 వాటిలో 4 లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం జరిగినది.

ఎఫ్)  పారిశుద్ధ్యం:-

పారిశుద్ధ్యం విభాగం నందు అమరచింత పురపాలక సంఘం ఏర్పడక ముందు కేవలం ఒక పారిశుద్ధ్య

వాహనం మాత్రమే ఉండేది. ప్రస్తుతం 6 వాహనాలు కలవు. స్వచ్చ ఆటో లు – 2, ఎలెక్ట్రిక్ స్వచ్చ ఆటో లు    – 2, వాటర్ టాంక్ – 1, పట్టణంలో దోమల నివారణ కొరకు ఒకటి ఫాగ్గింగ్ మిషన్ మరియు పట్టణంలో వివిధ అంటూ వ్యాధుల  నివారణ కొరకు మౌంటెడ్ స్ప్రెయర్ మిషన్ కొనుగోలు చేయడం జరిగినది. రెండు ఛార్జింగ్ హ్యాండ్ స్ప్రెయర్  పంపు లు కొనుగోలు చేయడం జరిగినది.

జి)       ఇందిరమ్మ ఇండ్లు:- 

          తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇండ్లు లేని నిరుపేదల కొరకు పట్టణంలో ప్రతి వార్డ్ నందు 100 ఇండ్లను కేటాయించడం జరిగినది. వాటిలో ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, వనపర్తి గారి ద్వారా 90 ఇండ్ల నిర్మాణం కొరకు ప్రొసీడింగ్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగినది. వాటిలో  ఇప్పటి వరకు 70 మంది లబ్ధి దారులు నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగినది వాటిలో బేస్మెంట్ లెవెల్  – 12, వాల్ లెవెల్  – 08, శ్లాబ్ లెవెల్  – 21, మరియు 16 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహాప్రవేశాలు చేసుకోవడం జరిగినది.

 

Contact Details:

Commissioner Amarchintha  Municipality

Email id: muncipalityamarchinta@gmail.com

Mobile No: 9989491009

 కమీషనర్

 పురపాలక సంఘం, అమరచింత.