79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 2025
వేదిక : Wanaparthy
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చీఫ్ విప్ ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు,సాధించిన లక్ష్యాలపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు.వేదికపై జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ,వనపర్తి MLA,దేవరకద్ర MLA,అదనపు కలెక్టర్లు హాజరయ్యారు.అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు.పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి ముఖ్య అతిథి ప్రశంసా పత్రాలు అందజేసారు.