వనపర్తి జిల్లాలో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు.

పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతో ఉపయోగపడతాయని, వనపర్తి జిల్లాలో అటవీ సంపదను 33 శాతంగా పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
సోమవారం “ప్రపంచ అటవీ దినోత్సవం” సందర్భంగా వనపర్తి స్థానిక ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అటవీ విస్తీర్ణం 33 శాతం చెట్లు పెంచేందుకు కృషి చేయాలని, తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ఇప్పటివరకు 6 విడతలుగా మొక్కలు నాటడం జరిగిందనీ, జిల్లాలో 1 కోటి 50 లక్షల మొక్కలు నాటి పరిరక్షించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో 5 శాతం మాత్రమే అటవి భూములలో మొక్కలు ఉన్నాయని, అటవీ విస్తీర్ణం పెంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, 28 ఎకరాలలో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ, అటవీశాఖ సిబ్బంది, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.