ముగించు

మోజర్లలోని హార్టికల్చర్ కళాశాల ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వివిధ ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమం.

5
ప్రారంభం : 10/01/2023 | ముగించు : 20/01/2023
 జిల్లాలోని మహిళలకు వివిధ రంగాల ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
       మంగళవారం పెద్దమందడి మండలం, మోజర్ల ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రంగాల ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల తయారీపై మహిళా సంఘ సభ్యులకు (ఎం.ఈ.డి.పి.) ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్, కొండ లక్ష్మణ్ బావుజి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం సౌజన్యంతో 20వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు 30 మంది మహిళలకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 
    ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలలోని స్వయం సహాయక సంఘ మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, మహిళలు ట్రైనింగ్ ద్వారా నైపుణ్యం పొంది ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు. ఉప ఉత్పత్తుల తయారీని పోత్సహించటం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు మహిళ స్వశక్తిగా మారటానికి మార్గమని ఆయన సూచించారు. శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన మహిళలకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు.
       

     అనంతరం శిక్షణ పొందిన మహిళలు వారి అభిప్రాయాలను వారు వివరించారు. వీటిలో భాగంగా ఒక మహిళ తయారు చేసిన సబ్బుల ద్వారా ఆమెకు దీర్ఘకాలికంగా ఉన్న ముఖంపై ఉన్న మచ్చలు, తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
   మరో మహిళ తయారు చేసిన షాంపూ ద్వారా జుట్టు చాలా మృదువుగా ఉన్నదని, తలలో చుండు 
తగ్గుతుందని, జుట్టు రాలటం తగ్గుతుందని తెలిపారు. లెమన్ గ్రాస్ ఆకులు, ముదురు కాడలతో టీ పౌడర్ తయారు చేయటం జరిగిందని తెలిపారు. 
    ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నరసింహులు, అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక, మోజర్ల ఉద్యాన కళాశాల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ అధికారి డా. జె.శంకరస్వామి, అబార్డు అసోసియేట్ డిన్ లక్ష్మినారాయణ, షణ్ముఖాచారి, ఇందిర, జిల్లా మహిళా సమాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.