ముగించు

ప్రధానమంత్రి సుక్ష్మ ఆహార ఉత్పత్తి తయారి సంస్థల క్రమబద్దీకరణ పథకంపై అవగాహన సదస్సు.

1
ప్రారంభం : 21/12/2022 | ముగించు : 31/12/2022

ప్రధానమంత్రి సుక్ష్మ ఆహార ఉత్పత్తి తయారి సంస్థల క్రమబద్దీకరణ పథకం కింద ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి పొందవచ్చునని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ శంగ్బాన్ సూచించారు. 

బుధవారం వనపర్తి పట్టణంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో “ప్రధానమంత్రి సుక్ష్మ ఆహార ఉత్పత్తి తయారి సంస్థల క్రమబద్దీకరణ పథకం” (PM-FME) పై  లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ, ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్  లబ్దిదారులు FSSAI  లైసెన్స్, ఆదార్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు.

PM-FME క్రెడిట్ లింకేడ్ సబ్సిడీ కొంపోనేట్ (Higher order Enterprises -Bank Credit) పథకములో వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాస్సేసింగ్ యూనిట్స్ లో అందించే సహాయము ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం వరకు ఋణ అనుసంధాన రాయితీ, గరిష్ట రాయితీ పరిమితి రూ 10.00 లక్షలు, ఆహార తయారీ రంగంలో ఉన్న స్వయం సహాయక సభ్యులకు సమాఖ్య స్థాయిలో మూలధనం ఉపకరణాల కొనుగోలుకై రూ 40,000/- విత్తన మూలధన ఋణం అందచేయబడుతుందని ఆయన వివరించారు. ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం వరకు అనుసంధాన రాయితీ (గరిష్ట రాయితీ పరిమితి రూ. 10,00,000/- ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు మూలధనం, మార్జిన్ మనిలో 20 శాతం వరకు సమానమైన వాటా స్వయం సహాయక సంఘాల (SHG) మూలధనంగా కలిగి వుండాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో సొసైటి ఎంప్యానల్ ట్రైనింగ్ సభ్యులు కార్తిక్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ. నర్సింహులు, అడిషనల్ డి.ఆర్.డి.ఓ.రేణుకాదేవి , డి.పి.యం, అరుణమ్మ, డి.పి.యం పి.రాములు , ఎ.పి.యంలు, PMFME పథకం లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.