ముగించు

దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్ష సమావేశం :

Review meeting on grounding of Dalit Bandhu scheme units:
ప్రారంభం : 22/02/2022 | ముగించు : 08/03/2022

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారులకు వేగవంతంగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు.
        మంగళవారం జిల్లా కలెక్టర్  కార్యాలయం సమావేశ మందిరంలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పై క్లస్టర్ అధికారులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులకు లాభసాటి యూనిట్ లపై అవగాహన కల్పించాలని క్లస్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖ, రవాణా శాఖ, పరిశ్రమల శాఖ, రిటైల్, షాప్ ల వ్యాపారాలు, సేవలు, తదితర శాఖల లాభసాటి యూనిట్లను  లబ్ధిదారులు నెలకొల్పు కునేలా చూడాలని అన్నారు. దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేసేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలుసుకుంటూ లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునే లా చూడాలని అన్నారు.  లబ్ధిదారులకు సాధ్యమైనంత ఎక్కువగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
      ఆయా శాఖల అధికారులతో సంబంధిత నమూనా ప్రాజెక్టు రిపోర్టర్ లను తయారు చేయించి, ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఆమె వివరించారు. జిల్లా స్థాయి కమిటీలను ఎంపిక చేయడంలో పూర్తి అవగాహనతో ఎంపిక చేపట్టాలని ఒక్కో వ్యక్తికి రూ. 10 లక్షల వరకు గ్రౌండింగ్ చేస్తున్నట్లు, వారికి ముందస్తు అవగాహన కల్పించడం జరుగుతుందని, మన జిల్లాలో నూతన పథకాల ద్వారా పూర్తి అవగాహనతో ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.
     ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సర్  (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వా న్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి సంఘం ఈ డి మల్లికార్జున్, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్ కుమార్, ఎల్ డి ఎం, మత్స్య శాఖ అధికారి, అదనపు డి ఆర్ డి ఓ కృష్ణయ్య, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.