తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

వేదిక : వనపర్తి
వనపర్తి ఐ.డి. ఒ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల
కో ఆపరెటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ శ్రీ ఎన్. ప్రీతం గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ విమోచన పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు.జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి గారు తో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.