జిల్లా కలెక్టరేట్లో ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు జరిగాయి.

వనపర్తి- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ”ధరణి పోర్టల్” అక్టోబర్ 29, 2020న ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదని, భూ రికార్డుల నిర్వహణ,సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం అని:కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ, మందిరంలో ధరణి ప్రారంభమై విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి సంబంధిత అధికారులకు తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ.డి.వేనుగోపాల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ), శ్రీ. ఆశిష్ సంఘ్వాన్, ఐ.ఏ.ఎస్ , అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జిల్లా తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.