ముగించు

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం.

1
ప్రారంభం : 20/03/2023 | ముగించు : 30/04/2023
 
క్షయ వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదని ఇంచార్జి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.  సోమవారం జిల్లా ఐడిఓసి మీటింగ్ హాల్లో నేషనల్ టి. బి. ఎలిమినేషన్ ప్రోగ్రాం నిక్షయ పోషణ యోజన కు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదని తెలిపారు. నిక్షయ పోషణ అభియాన్ క్రింద టీబీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, డి ఎం హెచ్ ఓ రవి శంకర్, ఏవో సాయినాథ్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చే జారీ చేయబడింది.