అంబెడ్కర్ జయంతి వేడుకలు.

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా శుక్రవారం వనపర్తి ఐ డి ఓ సి లో, అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా అంబేద్కర్ను గుర్తించి భారతరత్న ఇచ్చారని తెలిపారు. ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.