ముగించు

హార్టికల్చర్ మరియు క్రిబ్కో ఫెర్టిలైజర్ శాఖ ఆధ్వర్యంలో “రైతు సైన్స్ టూర్” బస్సును ప్రారంభించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మీన్ బాషా, IAS.,

Farmer Science Tour
ప్రారంభం : 07/02/2022 | ముగించు : 13/02/2022

              రైతులు విజ్ఞాన యాత్ర ద్వారా వ్యవసాయంలో మెళకువలు, ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించి, రైతులు ఆదాయం పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
             సోమవారం క్రిబ్ కో ఫర్టిలైజర్ సహకారంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలలోని ఆయిల్ పామ్ తోటలను పరిశీలించేందుకు వెళ్తున్న రైతుల విజ్ఞాన యాత్ర బస్సును జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
             ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 6 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇందుకు గాను ఇప్పటి వరకు 4 వేల దరఖాస్తులు అందినట్లు ఆమె తెలిపారు. రైతులు విజ్ఞాన యాత్రలో అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుని రావాలని ఆమె ఆకాంక్షించారు.
              ఉద్యానవన శాఖ, సీడ్ కంపెనీ, ఎరువుల, డ్రిప్పు కంపెనీల, క్రిబ్ కో ఫర్టిలైజార్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రైతుల విజ్ఞాన యాత్ర చేపట్టినందున జిల్లా కలెక్టర్ నిర్వాహకులను అభినందిస్తూ, ఇప్పటి వరకు 300 మంది రైతులు ఆయిల్ పామ్ తోటలు పరిశీలించారని, ఈ రోజు 72 మంది రైతులు ఖమ్మం, భద్రాద్రిలోని ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి, వాటి అవగాహనతో మన జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆమె సూచించారు.

       ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్, ఫీల్డ్ అధికారి తులసి రెడ్డి, క్రిబ్ కో ఫర్టిలైజర్ అధికారి వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.