ముగించు

చరిత్ర

చారిత్రక నేపథ్యం:

       తెలంగాణ రాష్ట్ర విభజన యొక్క జిల్లాల పునర్వ్యవస్తీకరణ చట్టం, 2016 ప్రకారం వనపర్తి జిల్లా మొత్తం (14) మండలాలతో ఎరతు చేయడం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో భాగంగా 8 మండలాలతో కూడిన వనపర్తి రెవెన్యూ డివిజన్ ఇప్పటికే ఉనికిలో ఉండగా కొత్తగా  మదనాపురం, రేవల్లి, చిన్నంబావి మరియు శ్రీరంగాపూర్ మండలాలు ఆలాగే మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట రెవెన్యూ డివిజన్ నుండి ఆత్మకూర్, చిన్నచింతకుంట మరియు నర్వ మండలాల నుండి కొత్తగా ఆత్మకూర్ మరియు అమరచింత మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది.

        పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా 2164.59 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 5,77,758 కలదు. ఇందులో 92,288 పట్టణ జనాభా మరియు 4,85,470 గ్రామీణ  జనాభాకలదు. జిల్లా  జనసాంద్రత చ.కి.మీకి 267మండి కలరు.  జిల్లాలో 84.03%  గ్రామీణ జనాభా మరియు పట్టణ జనాభా 15.97%కలదు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 16.13% కాగా, షెడ్యూల్డ్ తెగల  జనాభా 7.97% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం అక్షరాస్యత 55.67%, ఇందులో పురుషుల అక్షరాస్యత 65.73% మరియు స్త్రీల  అక్షరాస్యత 45.27%.

సరిహద్దులు మరియు స్థలాకృతి:

        జిల్లా ఉత్తరాన మహబూబ్‌నగర్ జిల్లా, తూర్పున నాగర్‌కర్నూల్, పశ్చిమాన జోగులాంబ గద్వాల్ జిల్లా, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా 160 మరియు 17’0 డిగ్రీల  అక్షాంశం మరియు 770 డిగ్రీల మరియు 780 డిగ్రీల రేఖాంశం మధ్య ఉంది.

       ఒకే రెవెన్యూ డివిజను గల జిల్లాలో (223) రెవెన్యూ గ్రామాలు, 255 గ్రామపంచాయతీలు మరియు (5) మునిసిపాలిటీలు కలిగి ఉన్న 14 మండలాలుగా ఉపవిభజన చేయబడింది. జిల్లా అధికార భాష తెలుగు మరియు రెండవ భాష ఉర్దూ.

పరిశ్రమలు:

          కొత్తకోట మరియు తిప్పడంపల్లి గ్రామాలు  పట్టు చీరలకు ప్రసిద్ధి. పాన్ గల్ మరియు వనపర్తి మండలాల్లో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, లైమ్‌స్టోన్ &లేటరైట్ ఏర్పడతాయి. పెద్దమందడి మండలం పెద్దమందడి గ్రామంలో రూ.42 కోట్ల పెట్టుబడితో ఎస్‌ఎస్‌వి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడం జరిగినీడ్ ఇందులో 180 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. కొత్తకోట మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో NSL కృష్ణవేణి షుగర్స్ లిమిటెడ్ మరియు పెబ్బేర్  మండలం రంగాపూర్ గ్రాములో  శాస్తా బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలను రూ.608 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయి మరియు ఈ రెండు ప్రాజెక్టులు కలిపి  433 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.

సూక్ష్మ మరియు చిన్న సంస్థలు:

          MSME చట్టం 2006 ప్రకారం, 1113 మందికి ఉపాధి కల్పిస్తూ రూ.95.45 కోట్ల పెట్టుబడితో మొత్తం 293 మైక్రో ఎంటర్‌ప్రైజెస్ మరియు రూ.112.26 కోట్ల పెట్టుబడితో 19 చిన్న పరిశ్రమలు 1223 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇట్టి సంస్థలు  అక్టోబర్,2006 నుండి మే,2015 మద్య స్థాపించడం జరిగింది.

నీటిపారుదల

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్

          ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కృష్ణా నది మీదుగా నందిమల్ల గ్రామం (వనపర్తి జిల్లా అమరచింత మండలం) మరియు రేవులపల్లి గ్రామం (జోగుళాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం) మధ్య 17.84 టీఎంసీల నీటిని వినియోగించుకుని 1,04,124 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు, కుడి ఎడమ కాలువలతో నిర్మించారు. కరువు పీడిత మండలాలైన అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, మదనాపూర్, పెబ్బేర్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి మరియు పెంట్లవెల్లి ఎడమకాలువ పరిధిలో (68,467 ఎకరాలు) మరియు ధరూర్, గద్వాల్, ఇటిక్యాల, మానోపాడ్ (35,657ఎకరాలు) కుడికాలువ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ 234 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి కోసం ఉద్దేశించబడింది మరియు ఈ భాగాన్ని TS GENCO అమలు చేసింది, ఈ ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం రూ. 1,815.20 కోట్లు (SSR 2012-13).

          ఊకచెట్టువాగు ప్రాజెక్ట్, రామన్‌పాడ్ (v), కిమీ 17.100 వద్ద PJP ఎడమ ప్రధాన కాలువపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 5,172 ఎకరాల ఆయకట్టుతో 1.900 TMC ప్రత్యేక కేటాయింపును కలిగి ఉంది. PJP ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని 73,639 ఎకరాల్లో (68,467+5,172) వనపర్తి జిల్లాలో ఆయకట్టు 69,975 ఎకరాలు కాగా మిగిలిన టెయిల్ ఎండ్ ఆయకట్ 3,664 ఎకరాలు నాగర్‌కర్నూల్ జిల్లాపరిధిలో ఉంది. మొత్తం ఆయకట్టుకు నీటిపారుదల సామర్థ్యం ఏర్పడుతుంది.

          రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం (RBLI), మరియు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (MGKLI) పథకాలు వరుసగా 70,347 మరియు 75,648 ఎకరాల ఆయకట్టుతో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు.

          వర్షాకాలం జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. జిల్లాలో వర్షపాతం నైరుతి నుండి ఈశాన్య దిశగా పెరుగుతుంది. దాదాపు 80% వర్షపాతం వర్షాకాలంలోనే కురుస్తుంది. జూలై &ఆగస్ట్ నెలలు పూర్తి వర్షపు నెలలు. జిల్లాలో 2022-2023 సాధారణ వర్షపాతం 579.6 మి.మీ కాగా 808.2 6 మి.మీ వర్షపాతం నమోదైంది.