ముగించు

స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం

శాఖ యొక్క సంక్షిప్త పరిచయం:

నిజాం కాలంలో లోకల్‌సెస్ వసూలు మరియు ఖర్చు వ్యవహారాలాను పరిశీలించుటకు గాను ఏర్పడిన లోకల్‌ఫండ్ శాఖ, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా అదే పేరుతో కొనసాగి 1997లో స్థానికసంస్థలతో పాటు ఇతర సంస్థల ఆర్థిక అంశాలను పరిశీలించే బాధ్యతను కూడా ఈ శాఖకు ఇచ్చి శాఖ పేరును రాష్ట్ర ఆడిటుశాఖగా మార్చడం జరిగింది.

అక్టోబరు 11, 2016న అవతరించిన జిల్లా ఆడిటు అధికారి, స్టేట్ ఆడిట్ కార్యాలయపు వనపర్తి పరిధిలో (5) మునిసిపాలిటీలు, (4) వ్యవసాయ మార్కెట్ కమిటీలు, (8) దేవాలయాలు, (14) మండల పరిషత్తులు, (255) గ్రామపంచాయతీలు, (1) జిల్లా గ్రంథాలయ సంస్థ , (1) జిల్లా పరిషత్ , (1) సి.డి.పి ,  కలిపి మొత్తం (289) సంస్థలు ఉన్నాయి. వీటితోపాటు పెన్షన్ పేపర్లు అప్రూవ్ చేయడం, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన ప్రీ ఆడిటు బిల్లులు పరిశీలించి ఆమోదించడం మరియు రాష్ట్ర ఆడిటు సంచాలకులు ఇచ్చే ఇతర  ఆడిటు బాధ్యతలు చేపట్టడం ఈ కార్యాలయపు ప్రధాన విధులు. ఆదాయంవైపు గాని, ఖర్చు వైపుగాని జరిగే అవకతవకలు, నియమాల ఉల్లంఘనలు, నిధుల దుర్వినియోగంలకు సంబంధించిన అభ్యంతరాలను నివేదికలో పొందుపర్చి తగు చర్య నిమిత్తము పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది. అలాగే (2020-2021 సం,,పు) 2021-2022 సం’’లో గ్రామపంచాయతి  ఆడిటులు 100 శాతం ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. ఆడిటు నివేదికలలో నిధుల అభ్యంతరాలతో పాటు సంస్థలకు మార్గనిర్దేశం చేయుట, సరైన సలహాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి విడుదలైన  గ్రాంటులపై కూడా ఈ కార్యాలయము తనిఖీలు చేసి ఉపయోగితా పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించడం మరియు నివేదికలను జారీచేయడం జరుగుతున్నది.

స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ నిర్వహించు కార్యకలాపాలు:-

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అందజేసే అభివృద్ధి కార్యకలాపాల నిధులు మరియు స్థానికసంస్థలు వసూలు చేసే వివిధ రకాల పన్నులు, రుసుములు సక్రమంగా వినియోగించబడుతున్నాయా ? లేదా? అని పరిశీలించుట.
  • ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ఆడిటు నిర్వహించబడును.
  • ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ గౌరవ సంచాలకులు గారి ద్వారా ఆమోదం తెలుపబడును.
  • ఈవిధంగా ఆమోదం తెలుపబడిన తరువాత ప్రతి ఉద్యోగి టార్గెట్ పెట్టుకొని పూర్తిచేయవలసి ఉంటుంది.
  • వనపర్తి జిల్లా ఆడిటు అధికారి, రాష్ట్ర ఆడిటు కార్యాలయము  అక్టోబరు 11, 2016న తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలు, జిల్లా కార్యాలయాలలో భాగంగా ఈ కార్యాలయము కూడా అదే రోజు ప్రారంభమైంది.

సిబ్బంది యొక్క  అధికారక్రమం :-

జిల్లా ఆడిటు అధికారి

సహాయ ఆడిటు అధికారి

సీనియర్ ఆడిటర్  

జూనియర్ ఆడిటర్

ఆఫీస్ సబార్డినేట్  

జిల్లా ఆడిటు అధికారి కార్యాలయము, స్టేట్ ఆడిట్, వనపర్తి కార్యాలయం నందు ఈ దిగువ చూపబడిన సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించుచున్నారు.
క్రమా సంక్య  ఉద్యోగి పేరు హోదా ఫోను నంబరు మెయిల్ ఐడి.

1

శ్రీ.ఎం.శ్రీనివాస్

జిల్లా ఆడిట్ అధికారి

9705343521

daosawanaparthy.ts@

gmail.com

2

శ్రీ.MD.యూసుఫ్ అహ్మద్

సీనియర్ ఆడిటర్

9440440718

yousuf1968@gmail.com

3

శ్రీ.పి.కుమార స్వామి

సీనియర్ ఆడిటర్

9985731479

kumaraswamyauditor@gmail.com

4

శ్రీమతి సుజాతమ్మ

సీనియర్ ఆడిటర్

9848329094

sujathaauditor@gmail.com

5

శ్రీ ఎస్ భాను ప్రకాష్ యాదవ్

జూనియర్ ఆడిటర్

9581358082

bhanuyadav8765@gmail.com

6

శ్రీమతి జి.శిల్ప

జూనియర్ ఆడిటర్

8074160618

shilpagilleda@gmail.com

7

శ్రీమతి సుల్తానా బేగం

ఆఫీస్ సబార్డినేట్

9640982508