వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం నుండి చేపట్టిన ఐడిఓసి క్షేత్ర పర్యటన లో భాగంగా విద్యార్థులు జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించారు.
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐడీఓసీ వనపర్తి క్షేత్ర పర్యటనను సందర్శించారు. విద్యార్థులు సంబంధిత శాఖకు వెళ్లగా, సంబంధిత శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సేవలపై వివరణ ఇచ్చారు. తరువాత IDOC సమావేశ మందిరంలో, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ శ్రీ. తేజస్ నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ విద్యార్థులతో సమావేశమై ప్రసంగించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర పర్యటనలో భాగంగా ఐడిఓసి కు రావడం విద్యార్థులందరికీ ఓ మంచి చదవకాశమని క్షేత్ర పర్యటనలో విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర పర్యటన వల్ల విద్యార్థులకు అవగాహనతో పాటు సృజనాత్మకత పెరుగుతుందని క్షేత్ర పర్యటన చేపట్టిన కళాశాల ఆంగ్ల అధ్యాపకులను అభినందించారు. విద్యార్థులందరూ విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. మెరుగైన సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. వెంకటప్రసాద్, అధ్యాపకులు సత్తెమ్మ, దామోదర్ రెడ్డి, విష్ణుమూర్తి, శ్రీనివాస్, స్రవంతి, మహబూబ్ పాషా, పరశురాముడు, శ్వేత, శానవాజ్, వీరయ్య, కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.