ముగించు

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎన్.సి.సి దినోత్సవం వేడుకలకు

1
ప్రారంభం : 26/11/2022 | ముగించు : 30/11/2022

సమాజంలో క్రమశిక్షణ, జాతీయ భావం కలిగేలా ఎన్.సి.సి. క్యాండెట్స్ పనిచేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

    శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 74వ. “ఎన్.సి.సి దినోత్సవం” వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎన్.సి.సి. పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఎన్.సి.సి. క్యాందెట్స్ గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు.

1

      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యతకు, క్రమశిక్షణకు, జాతీయ భావం పెంపొందించేందుకు ఎన్.సి.సి. పేరుగాంచిందని ఆమె అన్నారు. ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు తగ్గుతున్న నేపథ్యంలో ఎన్.సి.సి. క్యాండెట్ లు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆమె సూచించారు. సమాజంలో క్రమశిక్షణ, జాతీయ భావం తీసుక వచ్చేందుకు కృషి చేయాలని ఆమె తెలిపారు.

     అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

     ఈ కార్యక్రమంలో డి. ఐ. ఈ. ఓ. జాకీర్ హుస్సేన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గాయత్రి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు,, ఎన్.సి.సి. కమాండెంట్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.