ముగించు

జనవరి 25న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం (NVD) వేడుకలు.

Celebration of 12th National Voters’ Day (NVD)
ప్రారంభం : 25/01/2022 | ముగించు : 31/01/2022

          ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
         మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో “జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని” పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు.
         ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ద్వారా సమర్థ వంతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 2011 సం. లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ సంవత్సరం 12 వ. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపకుంటున్నట్లు ఆమె సూచించారు.        ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.